కాటమరాయుడు సింపుల్ ..సాగుతున్న రోజా రబ్బర్

0
727

  pawan kalyan katama rayuda movie new poster roja said pawan kalyan rabbar singh
పవర్ స్టార్ పుట్టినరోజునాడే అయన తరువాత చిత్రం టైటిల్ ,ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాత శరత్ మరార్. బర్త్ డే సెలెబ్రేషన్స్ కి దూరంగా వుండే పవన్ చెప్పారో లేక నిర్మాతలే నిర్ణయం తీసుకున్నారో గానీ ఫస్ట్ లుక్ మరీ సింపుల్ గా వుంది.ఇక సినిమా పేరు ముందుగా నలుగుతున్న కాటమరాయుడు ఫిక్స్ చేశారు.

roja-pawan

ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం ఫాన్స్ డిసప్పాయింట్ అయ్యారు .ఇంతకముందు బయటికి వచ్చిన ఫోటో ని గ్రాఫిక్స్ మధ్య పెట్టి రిలీజ్ చేశారు.కొత్తదనం లేని పోస్టర్ చూసి నిరుత్సాహపడ్డ ఫాన్స్ ని వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఇంకాస్త ఇబ్బంది పెట్టారు.పుట్టిన రోజు అని కూడా చూడకుండా జనసేనాధిపతి పవన్ మీద రబ్బర్ సింగ్ డైలాగు మళ్లీ పేల్చారు.హోదాకోసం ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ ఇన్నాళ్లు ఏమి చేస్తున్నాడని నిలదీశారు.అయన ముమ్మాటికీ రబ్బర్ సింగ్ మాత్రం అన్నారు.అంతటితో ఆగకుండా పవన్ ని ప్యాకేజ్ స్టార్ గా అభివర్ణించారు.దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడో తెలియాలంటే కాకినాడ సభ దాకా ఆగాల్సిందే ..

Leave a Reply