తమ్ముళ్లతో ‘ఖుషి’ చేస్తుండు

 Posted October 17, 2016

 pawan kalyan katama rayudu movie new brothers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముళ్లతో ఖుషి చేస్తుండు. దానికి సంబంధించిన ఓ పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. డాలీ దర్శకత్వంలో పవన్ – శృతి హాసన్ జంటగా “కాటమరాయుడు” చిత్రం తెరకెక్కున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కి ముగ్గురు తముళ్లు ఉండనున్నారు. విజయ్ దేవరకొండ, కమల్ కామరాజు, శివబాలజీలు పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో జరుగుతోంది. ఈ సందర్బంగా పవన్ (కాటమరాయుడు) తమ్ముళ్లు మరియు కమెడియన్ అలీతో కలసి ఓ స్టిల్ ఇచ్చాడు. ఇప్పుడీ స్టిల్ ని చూసి.. అరె పవన్ తమ్ముళ్లతో మస్త్ ఖుషి చేస్తుండని మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

ఇదిలావుండగా.. ఇకపై ‘కాటమరాయుడు’ని జెడ్ స్పీడుతో ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఫిబ్రవరిలోగా కాటమరాయుడు షూటింగ్ ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకొన్నాడు పవన్. వచ్చే యేడాది మార్చి 31న కాటమరాయుడుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

SHARE