కలెక్షన్లు సాధించలేక కళ్లు తేలిసిన కాటమరాయుడు

0
488
pawan kalyan katamarayudu collections decrease distributors shocked

 Posted [relativedate]

pawan kalyan katamarayudu collections decrease distributors shockedపవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా నటించిన కాటమరాయుడు మార్చి 24న అంటే గత  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు,  భారీ ఓపెనింగ్స్  మధ్య రిలీజయ్యింది ఈ సినిమా. అనుకున్న విధంగానే తన పవనిజంతో మొదటిరోజు మాత్రం కలెక్షన్లను భారీగా కలెక్ట్ చేశాడు కాటమరాయుడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై భారీగా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో   ఫస్ట్ డే రూ. 22 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తే, రెండో రోజు ఆ కలెక్షన్ భారీగా పడిపోయింది…. కేవలం రూ.5.12 కోట్ల షేర్ తో సరిపెట్టేసింది.

ఇక సినిమాకు వచ్చిన హైప్ చూసి ఓవర్సీలో రైట్స్ కొనుగోలు చేసిన  బయ్యర్లకు పెద్ద దెబ్బే తగిలింది. భారీ రేటుకు కొనడంతో పాటు అందుకు  తగట్టే సినిమా ప్రీమియర్స్ వేశారు. గతం లో ఎన్నడూ లేని విధంగా 250 స్క్రీన్ లలో కాటమరాయుడు దిగాడు.  ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్లను వసూలు చేస్తుందని ఆశించారు.  కానీ ప్రిమియర్లతో పాటు తొలి రోజు వసూళ్లను కలిపినా మిలియన్ డాలర్ల మార్కును రాయుడు అందుకోలేకపోయాడు. గురు, శుక్రవారాల్లో  ఈ చిత్రానికి కేవలం 6.67 లక్షల డాలర్లు వసూలయ్యాయట. పెట్టిన పెట్టుబడి, చేసిన ప్రమోషన్ వీటితో పోల్చితే ఈ మొత్తం చాలా చిన్నదని వాపోతున్నారు. వీకెండ్ లోనే ఇంత ఘోరంగా కలెక్షన్స్ ఉంటే ఇక కాటమరాయుడు ఎలా గట్టేక్కుతాడని ఆవేదన చెందుతున్నారు. ఈ లెక్క న చూస్తే సర్దార్ కన్నా రాయుడు బాగా నష్టాలు తెచ్చాడంటున్నాయి  ట్రేడ్ వర్గాలు.

Leave a Reply