Posted [relativedate]
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కాటమరాయుడు సినిమా. ఇప్పటివరకు కేవలం పోస్టర్లతోనే సర్దుకున్న పవన్ అభిమానులు రీసెంట్ గా విడుదలైన టీజర్ తో పండగ చేసుకుంటున్నారు. కేవలం 57 ఏడు గంటల్లో 5 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ఇక అసలు విషయానికొస్తే ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్ట్రన్ బీట్ తో ఉన్న ఆ పాట పవన్ మునపటి సినిమాల్లాల్లోని పాటలానే ఉండడంతో అభిమానులు విని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా సినిమాలోని పవన్ క్యారక్టర్ ని కొట్టచ్చేట్టు చూపించిన ఈ పాట నిజంగా సినిమాకు సంబంధించినది కాదని, కొంతమంది అభిమానులు సరదాగా చేసిన పాటని కొందరు కొట్టిపారేస్తున్నారు.
ఇటీవల కాలంలో కొందరు దర్శకనిర్మాతలు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను, హీరో ఇంట్రడక్షన్ సీన్లను ముందుగా తామే రిలిజ్ చేసి , తమ సినిమాల్లో సీన్లు లీకైపోయాయంటూ హడావుడి చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారని కొందరు సినీ విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో లీకైదంటూ హల్ చల్ చేస్తున్న పవన్ పాట కూడా అదే మాదిరి ప్రమోషన్ అంటున్నారు. ఏది ఏమైనా ఈ పాట గురించి దర్శకనిర్మాతలు స్పందించేవరకు ఎవరికి తోచింది వారు వెల్లడిస్తూనే ఉంటారు.