కాటమరాయుడు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

0
704
pawan kalyan katamarayudu movie teaser details

Posted [relativedate]

pawan kalyan katamarayudu movie teaser detailsమెగా అభిమానులకు ఇంకో గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మల్టీస్టారర్ రానుందని ప్రకటన వచ్చిన కాసేపటికే  మరో శుభవార్తను అందిచారు కాటమరాయుడు యూనిట్ సభ్యులు. ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ కాటమరాయుడు సినిమా టీజర్ ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు రిలీజవుతుందని ప్రకటించింది.

పవన్  ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు అన్న ప్రకటన వచ్చిన  దగ్గర్నుంచి అభిమానుల్లో భారీ స్థాయిలో క్రేజ్ మొదలైంది.  ఇక రిలీజైన ఫస్ట్ లుక్స్, మోషన్ పోస్టర్స్  ఆ క్రేజ్ ను మరింత పెంచాయి. దీంతో టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే జనవరి నెలలోనే టీజర్ రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించినా పలు కారణాల వల్ల ఆ టీజర్  వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాపడ్డారు. వారిలో ఉత్సాహం నింపే విధంగా టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఓ పక్క మల్టీ స్టారర్ ప్రకటన, మరో పక్క కాటమరాయుడు టీజర్ ప్రకటన…  ఇంకేముంది మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here