అదిరిపోయిన  కాటమరాయుడు టీజర్..!!

Posted February 4, 2017

Katamarayudu Official Teaserఎప్పట్నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు మొన్న ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పలు కారణాల వల్ల రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అయిన కాటమరాయుడు టీజర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. ఇప్పటివరకు కాటమరాయుడికి సంబంధించి రెండు మూడు పోస్టర్లతో సర్దుకున్న అభిమానుల్లో కొద్ది సేపటి క్రితం  రిలీజైన్ ఈ టీజర్ ఫుల్ జోష్ ని నింపింది.

‘ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం’ అంటూ  పవన్‌ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ నిజంగా సూపర్బ్.  పవన్ లుక్స్ తో సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ తెలిసేలా రూపొందించిన ఈ  టీజర్ లో ‘రాయుడూ..’ అంటూ వస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది. కాగా ఈ సినిమాను ఉగాది కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు  చేస్తున్నామని చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలిపారు. కాగా  సర్దార్ గబ్బర్ సింగ్ తో అభిమానులను కాస్త నిరాశపరచిన పవన్ కాటమరాయుడుతో అలరిస్తాడో లేదో చూడాలి.

SHARE