ఆ మాజీ సీఎంతో పవన్ భేటీ ఎందుకో ?

0
502

 pawan kalyan meet karnataka ex cm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ….కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జె.డి.కుమారస్వామి..ఈ ఇద్దరు కలయిక ఎందుకో?ఇటీవల కొడుకు చిత్రం ప్రమోషన్ కోసం కుమారస్వామి హైదరాబాద్ వచ్చారు.ఆ సమయంలోనే అయన పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిశారు.ఆ ఇద్దరి మధ్య కేవలం సినీ రంగ అంశాలు మాత్రమే ప్రస్తావనకు రాలేదు.సహజంగానే రాజకీయ విషయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి .

ప్రజాక్షేత్రంలో వచ్చే వివిధ సమస్యలు ,వాటి పరిష్కారాలు …ప్రభుత్వ పరంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి పవన్ ఆయన్ను అడిగి తెలుసుకున్నారట. ఆంధ్రాకి ప్రత్యేక హోదా సహా వివిధ అంశాల్లో ఎంత వేడి రగులుతున్నామౌనంగా ఉన్న పవన్ లోపాయికారీగా తమ వ్యూహానికి పదును పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది .2017 సంవత్సరంలో జనసేన అధిపతి ఓ భారీ సభ ధ్వారా తన రాజకీయ లక్ష్యాలు వివరించడానికి సంసిద్ధమవుతున్నట్టు సమాచారం .అందులో భాగంగా కుమార స్వామి లాంటి సీనియర్ నేతలతో రహస్య భేటీలు జరుపుతున్నట్టు తెలుస్తోంది .

pawan-kalyan-(1)

Leave a Reply