పవన్‌ తర్వాత ప్రాజెక్ట్‌లపై గందరగోళం

0
739
pawan kalyan next movies after completed trivikram movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

pawan kalyan next movies after completed trivikram movie
‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘కాటమరాయుడు’, ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీ వరుసగా చేసుకుంటూ వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత కూడా పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. త్రివిక్రమ్‌తో సినిమా పూర్తి అయిన తర్వాత నేసన్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ ఇంకా ఇద్దరు ముగ్గురు దర్శకులకు పవన్‌ కళ్యాణ్‌ ఓకే చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పవన్‌ తర్వాత సినిమాపై క్లారిటీ రాలేదు.

పవన్‌ కళ్యాణ్‌ 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో 2018 వరకే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఇంకా సంవత్సర కాలంలోనే వీరందరితో సినిమాలు చేయడం అంటే సాధ్యం అయ్యే పని కాదు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ తర్వాత సినిమా ఏంటి ఆ తర్వాత ఏ దర్శకుడితో చేస్తాడు, పవన్‌ చివరి సినిమా ఏంటి అనే విషయాలపై గందరగోళ పరిస్థితి ఉంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్‌ సినిమాల్లో నటిస్తాడా, 2019 ఎన్నికల తర్వాత మళ్లీ పవన్‌ మొహానికి రంగు వేసుకుంటాడా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Leave a Reply