ప‌వ‌న్ పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్స్!!!

0
313
pawan kalyan political discussion

Posted [relativedate]

pawan kalyan political discussion
జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల‌పై చాలా సీరియ‌స్ గానే దృష్టిపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే గ‌త కొంత‌కాలంగా పాలిటిక్స్ లో ఆయ‌న చాలా యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయ‌న కాట‌మరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే… రాజ‌కీయాల‌కు కూడా స‌మయాన్ని కేటాయిస్తున్నారు. త‌న పార్టీ భ‌విష్య‌త్తుపై మంత‌నాలు జ‌రుపుతున్నారట‌. ప్ర‌జా స‌మ‌స్య‌లను తెలుసుకోవ‌డంతో పాటు జ‌న‌సేన ప్లానింగ్ పై ఎక్కువ‌గా డిస్క‌ష‌న్స్ చేస్తున్న‌ట్టు టాక్.

ఈ మ‌ధ్య ప‌వ‌న్ ను ఎవ‌రు క‌లిసినా… జ‌న‌సేన గురించి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటున్నార‌ట. జ‌నసేనపై ప్ర‌జ‌ల్లో ఏం చ‌ర్చ న‌డుస్తోంది? సామాన్యులు ఏమ‌నుకుంటున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌రిలో ఉంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఇలా అన్ని అంశాల‌పై చాలా సీరియ‌స్ గా మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు టాక్.

సాధార‌ణంగా అంద‌రితోనూ అభిప్రాయాల‌ను పంచుకునేందుకు ప‌వ‌న్ ఇష్ట‌ప‌డ‌రు. అలాంటిది ఈ డిస్క‌ష‌న్ ఏంట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని వెన‌క ఓ రీజ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ కు స‌న్నిహితుడైన డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్… ఆయ‌న‌కు ఈ స‌ల‌హా ఇచ్చారట‌. ముందు జ‌న‌సేన గురించి సామాన్య జ‌నం ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవాల‌ని సూచించార‌ట‌. అందుకే ప‌వ‌ర్ స్టార్ ఈ డిస్క‌ష‌న్ ఫార్ములాను ఫాలో అవుతున్నార‌న్న వాద‌న ఉంది.

అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌తోనూ భేటీ అయ్యారట‌. వారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నార‌ట‌. వారిలో కొంత‌మంది క‌థా ర‌చ‌యిత‌లు, పాటల ర‌చ‌యిత‌లు ఉన్నార‌ని టాక్. జ‌న‌సేన జ‌నంలోకి వెళ్ల‌డానికి ముందు పాట‌ల‌పై ఎక్కువ కాన్స‌న్ ట్రేష‌న్ పెట్టార‌ట ప‌వ‌న్. పాట‌ల్లో జ‌న‌సేన విధివిధానాల‌న్నీ క‌వ‌ర్ అయ్యేలా ఉండాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్ అట‌. అందుకే చంద్ర‌బోస్, అనంత్ శ్రీరామ్ లాంటి వారికి కొన్ని పాట‌లు రాసివ్వాల‌ని జ‌న‌సేనాని సూచించార‌ట‌.

ఒక‌వైపు పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్స్, మ‌రోవైపు పాట‌ల కోసం ప్రిప‌రేష‌న్ తో జ‌న‌సేనపై హైప్ పెంచేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. అందుకే ప‌వ‌న్ స్టార్ కూడా ఎన్టీఆర్ లా మ‌రోసారి తెలుగు రాజ‌కీయాన్ని ఏమైనా మ‌లుపు తిప్పుతారా అని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రి ఫ్యాన్స్ క‌ల క‌ల‌గానేఉంటుందా… ఆయ‌న నిజంగానే మ‌లుపు తిప్పుతారా అన్న‌ది 2019 ఎన్నిక‌ల్లోనే తేల‌నుంది.!!అప్పటిదాకా ఈ ఊహాగానాల‌తోనే సంతృప్తిపడాలి!!

Leave a Reply