ఆ నిర్మాత దెబ్బకి పవన్ పరువు పోతుందా?

Posted April 5, 2017

pawan kalyan prestige loss because of sharath marar
నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో శరత్ మరార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయిపోయారు.తొలి సినిమా గోపాల గోపాల సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి చేశారు.ఆ సినిమా బాగానే కలెక్షన్స్ రాబట్టినా ఆ తర్వాత నార్త్ స్టార్ బ్యానర్ లో తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ప్లాప్ టాక్ తో బయ్యర్లకి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.అయితే వారికి సహాయం చేసే ఉద్దేశముందని చెప్పి ఇప్పుడు తీసిన కాటమరాయుడు కూడా కొనుక్కున్నవాళ్ళకి నష్టాలే తెచ్చిపెట్టేలా వుంది.

సర్దార్ గబ్బర్ సింగ్ టైం లో నష్టపోయిన కొంత మంది తమకు కాటమరాయుడు కి అవకాశం ఇవ్వలేదని నిరాహార దీక్షల దాకా వెళ్లిన విషయం తెలిసిందే.వాళ్లంతా పవన్ ని ఒక్క మాట అనకుండా నిర్మాత శరత్ మరార్ వైఖరి మీద మాత్రం నిప్పులు కక్కారు.ఇప్పుడు కాటమరాయుడు కొన్నవాళ్ళు కూడా సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వగానే మరార్ మీద యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.వరసగా రెండు సినిమాలు,రెండు ప్లాప్స్ తో ఇటు అభిమానులకి,అటు నష్టాలు తెచ్చిపెట్టి బయ్యర్లకి ఎసరు పెట్టిన మరార్ వల్ల పవన్ పరువు పోయేలా వుంది.

SHARE