పవన్ మాట మీద నిలబడతాడా..?

0
650
pawan kalyan promised katamarayudu movie business giving to who lost sardaar gabbar singh movie distributors

Posted [relativedate]

pawan kalyan promised katamarayudu movie business giving to who lost sardaar gabbar singh movie distributors
ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ ఇచ్చిన మాట నిలుపుకుంటాడా లేదా అనే జర్చ జోరుగా జరుగుతోంది. అందుకు కారణం సర్దార్ గబ్బర్ సింగ్. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆశినంత లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. కొన్ని ఏరియాల్లో అయితే బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో భారీగా నష్టపోయిన బయ్యర్లకు మరో ఛాన్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. నిర్మాత శరత్ మరార్ కూడా అందుకు యాక్సెప్ట్ చేశాడు.

కాగా కాటమరాయుడు సినిమా పనులు జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే.అప్పుడే ప్రీ రిలీజ్ కూడా బిజినెస్ కూడా జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌లే సర్దార్ సినిమా బ‌య్య‌ర్లు శరత్ మరార్ తో బిజినెస్ గురించి చర్చించగా.. ఇంత పెద్ద మొత్తాల్ని మీరు బేర్ చేయ‌గ‌ల‌రా అంటూ శ‌ర‌త్‌మ‌రార్ ప్రశ్నించారట‌. దీంతో స‌ద‌రు బ‌య్య‌ర్లు ఆ నిర్మాత మీద గుర్రుగా ఉన్నారని, ఈ విషయంపై పవన్ ను కలవాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. మరి పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో లేక తన ప్రొడ్యూసర్ ని సపోర్ట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here