ప్రశ్నించిన పవన్… హోదా పై వార్_ పార్ట్ 2

 pawan kalyan question asking central govt special status part 2

మూడు విషయాలు మాట్లాడుతా..
మూడు విషయాలు మాట్లాడటానికి వచ్చాను. పార్టీ ఆవిర్భావం..రాజకీయాలు ఏమి ఎదుర్కొన్నాను..టిడిపి ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది ? తన అభిప్రాయం…రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద తన అభిప్రాయాన్ని వెల్లడిస్తా. తిరుపతిలోనే ఎందుకు మాట్లాడాలి.. గతంలో ఇక్కడి నుండే మాట్లాడడం జరిగింది. అందుకే ఇక్కడి నుండే మాట్లాడడానికి నిర్ణయించినా. మోడీ భజన చేయలేదు…మోడీ భజన చేయడానికి పెట్టారని కొందరు..టిటిడి తొత్తులాగా ఉన్నారని..గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్ అని అన్నారు. మాటలు పడకుండా ఉంటామా..? తన జీవితం రాష్ట్రం..దేశం కోసం అంకితం చేస్తా…మోడీకి భజన చేయను. కొన్ని మాటలు సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. వామపక్షాలు..వారు చేసే పోరాటం అంటే గౌరవం. చేగువేరా అంటే ఇష్టం.

బీజేపీలోకి రావాలన్నారు…
జాతీయ పార్టీలకు భవిష్యత్ ఉంది…ప్రాంతీయ పార్టీలకు ఛాన్స్ లేదు..బీజేపీకి రావాలని అన్నారు. తన పార్టీ జాతీయ శ్రేయస్సు కోరే పార్టీ. పార్టీ సిద్ధాంతాలంటే గౌరవం.. ఉంది. ప్రత్యేక హోదా…విషయంలో మాట్లాడుతా. సీమాంధ్రులంటే చులకన..పౌరుషం లేని వారా ? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆడుకొంటోంది ? సీమాంధ్రులకు దేశంపై ప్రేమ ఉంది. ఇచ్చిన మాట వెనక్కి తిప్పితే సీమాంధ్రుల పోరాటం..పౌరుషం చూస్తారు’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు………

 జతకట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వస్తున్న ఆరోపణలపై పవన్ స్పందించారు. ఎన్నికల రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలన్న ఆశలేదనీ, కలిసి పోటీ చేసే ప్రస్తక్తే లేదని ప్రకటించారు. పార్టీ పెట్టిన కొత్తలో బీజేపీ కేంద్ర నేత ఒకరు తనను కలిశారనీ చెప్పారు. ‘ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి బీజేపీలోకి ఆహ్వానించారు’ అని చెప్పారు. అయితే తాను వచ్చింది పదవుల కోసం కాదనీ, ప్రజలకు న్యాయం చేయడం కోసమని తెలిపారు. అందుకే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించానన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.

 

SHARE