ప్రశ్నించిన పవన్… హోదా పై వార్_ పార్ట్ 3

0
445

    pawan kalyan question asking central govt special status part 3

తిరుపతిలో జరుగుతున్న జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించారు. ప్రధాని మోదీకి, తెలుగుదేశానికి భజనసేన అని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సినిమాల్లోనే గబ్బర్‌సింగ్ రాజకీయాల్లో రబ్బర్‌సింగ్ అంటూ తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే వీటన్నింటినీ పడాల్సిన అవసరం ఉందనీ, పడతానని పేర్కొన్నారు.

రాజకీయాలు నాకు అవసరం లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వర్తమాన రాజకీయ నాయకులు యువతకు మేలు చేయకపోవడం బాధ కలుగుతోంది. నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, సమాజం, దేశం మీద వ్యామోహం ఉంది.

నా జీవితం రాష్ట్ర, దేశ శ్రేయస్సుకు అంకితమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నేను రైతు పక్షపాతిని, ప్రజాపక్షపాతిని, ఆడబిడ్డల పక్షపాతిని అని అన్నారు. నేను ఏ పార్టీకో, వ్యక్తులతో నా జీవితాన్నివ్వన్ను అని స్పష్టం చేశారు.

అమరావతి రాజధాని విషయంలో రైతు సమస్యలపై రైతు పక్షపాతిగా వ్యవహరించానని పవన్‌ అన్నారు. తాను చెప్పిన వాటికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అంగీకరించిందని ఆయన చెప్పారు. తనకు కుల ముద్ర వేశారని ఆయన అన్నారు. మనది ఒకేటే కులం, ఒకటే మతం, మానవతా కులం, మానవతా మతం అని పవన్‌ అన్నారు.

సీమాంధ్రులంటే చులకనా.. అంత అలుసా.. కేంద్రప్రభుత్వాలు అడుకుంటున్నాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘సీమాంధ్రుల ప్రేమ చూశారు. సహనం చూశారు. ఇచ్చిన మాట తప్పితే.. సీమాంధ్రుల పోరాట పఠిమ కూడా చూస్తారు’ అని ఆయన ప్రకటించారు. ఆత్మ గౌరవం దెబ్బతీస్తే.. దేశం మొత్తం చూసేలా పోరాటం చేస్తామని రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ మోసం చేసిందనీ, హోదా ఇవ్వకుండా బీజేపీ తాత్సారం చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీమాంధ్రకు ఏం చేయాలో చెప్పకుండా ఇలా నడిరోడ్డుపై నిలబెట్టి ఆటలాడుతున్నాయన్నారు.

Leave a Reply