ప్రశ్నించిన పవన్… హోదా పై వార్_ పార్ట్ 1

 pawan kalyan question asking central govt special status

పవన్ కళ్యాణ్…మళ్లీ ప్రజల ముందుకొచ్చార. చాలా కాలం తరువాత బహిరంగ సభలో మాట్లాడారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావం..రాజకీయాల్లో ఎంట్రీ..తదితర వాటిపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా..కేంద్రం ఇచ్చిన హామీలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే…

ఆచితూచి మాట్లాడుతా..
”నోటి నుండి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. ఏం మాట మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతా..దేశ సంపద యువత. జనసేన పార్టీ పెట్టి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తోంది. రాజకీయాలు, పదవులపై వ్యామోహం లేదు. అభిమానుల ప్రేమ కావాలి. కోట్లు సంపాదిస్తాను..కోట్ల ట్యాక్స్ కడుతాను…సుఖంగా ఇంట్లో కూర్చొవచ్చు..మరి రాజకీయాలు ఎందుకు ? సమాజం..దేశం మీద బాధ..వ్యామోహం ఉంది. వర్తమాన రాజకీయాలు..రాజకీయ నాయకులు..యువతకు మేలు చేయకపోతే తనకు బాధ కలుగుతుంది. సినిమాలో చాలా చెబుతాం. రెండు గంటల్లో..అద్బుతాలు చెప్పవచ్చు..ఆస్తులు దానం..రౌడీలు..విలన్లు కొట్టవచ్చు. హీరోయిన్లతో పాటలు పాడవచ్చు..కానీ నిజ జీవితంలో అసలైన సమస్యలకు రాందేవ్ బాబా ద్వారా నూడ్స్ ల ద్వారా పరిష్కారం దొరకవు.

SHARE