పవన్ స్వరం మారుతోందా?

  pawan kalyan raise voice chandrababu at tv9
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడిస్తున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలకి ఫుల్ స్టాప్ పడబోతోంది. రెండు సభల్లో బాబు మీద పెద్దగా టార్గెట్ చేయని పవన్ కళ్యాణ్ tv9 ఇంటర్వ్యూ లో బాణీ మార్చేశారు. ప్యాకేజ్ విషయంలో టీడీపీ సర్కార్ వైఖరిని పవన్ సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజ్ మంచిదని భావిస్తే హోదా పేరుతో రెండేళ్లు ఎందుకు కాలయాపన చేశారని బాబుని నిలదీశారు. అంతకన్నా ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని కూడా అయన గుర్తు చేశారు. రైతు రుణ మాఫీ అంశాన్ని తొలిసారి ప్రస్తావించారు. అవసరమైతే ఏ స్థాయి ఉద్యమానికైనా.. ఎవరిపై పోరాటానికి అయినా సిద్ధమని పవన్ సంకేతాలిచ్చారు.
Tv9 ఇంటర్వ్యూలో పవన్ సంధించిన మరికొన్ని బులెట్ పాయింట్స్ ఇవే ..
పవన్ కళ్యాణ్… టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు…
* నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధం.
* ప్రత్యేక హోదా పై పోరాటం ఏ స్థాయికైనా తీసుకెళ్తా
* 2019 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా
* ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదు, అవసరం
* ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పడం నా విధి
* కచ్చితంగా పార్టీలు నన్ను నలిపేస్తాయి
* నేను వెంకయ్య నాయుడు ను టార్గెట్ చేయలేదు
* నా వెనుక నిష్ణాతులైన బృందం ఉంది
* సీపీఎం నేతలతో త్వరలో చర్చలు జరుపుతా
* ఆంధ్రావాళ్లు నష్టపోతున్నారని చెప్పిందే వెంకయ్య నాయుడు
* దశాబ్దానికి పైగా పోరాడితేనే తెలంగాణ వచ్చింది
* నేను చేతుల్లో చూపిస్తా.. ఎవరి పై కక్ష లేదు
* ప్రజల భావోద్యాగాలు బాగా తెలిసిన వెంకయ్య నాయుడు అంత తేలిగ్గా మాట మార్చిన కుదరదు
* రాజకీయాలకు డబ్బులు కావాలి.. విరాళాలు సేకరిస్తా
* స్టేజీ వేసేంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి
* కులాలపై మమకారం లేదు… గౌరవిస్తా
* ప్రత్యేక హోదా పై అప్పుడు భాజపా రెచ్చగొట్టకుండా ఉండాల్సిది
* సినిమా బాగలేకుంటే తిడతారు.. రాజకీయాల్లో విమర్శలు మామూలే
* అనాగరికమైన భాష నేను మాట్లాడలేదు
* బలమైన ప్రతిపక్షం కనుకనే రాష్ట్ర సమస్యలు చెప్పడానికి అప్పుడు భాజపా తో కలిసా
* ప్రత్యేక హోదా అవసరం లేనప్పుడు… భాజపా వారు అప్పుడు హడావుడి ఎందుకు చేశారు
* దెబ్బలు తింటాం… మోకాళ్ల చిప్పలు పగులుతాయి
* హుధ్ ధ్ తుఫాను నిధులు రాడానికి ఎంత సమయం పట్టిందో

* * అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండాలన్నదే జనసేన లక్ష్యం

* నోటికి వచ్చిన లెక్కలు చెబితే ఎలా… నాకైతే కంటితుడుపుగా ఉంది
* జనసేన కు చందాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు
* పోరాటం నిరంతరం జరగాల్సిందే
* పాచి లడ్డూ లని ఎందుకు అన్నానో అర్ధం కావాల్సిన వాళ్లకు అర్ధం అయింది
* అలా అనడానికి కారణం సమయం వచ్చినప్పుడు చెబుతా
* అధికారం కోసం వచ్చిన వారి వల్ల పీఆర్పీకి నష్టం జరిగింది.. జనసేన కు అలా జరగకూడదు
* సినిమాల కోసం మాట్లాడటం లేదు.. మనసులో ఉన్నదే చెబుతున్నా
* వెంకయ్య నాయుడు తన భాధ్యత నుంచి తప్పించుకోవడానికి కుదరదు
SHARE