ఎట్టకేలకు స్పందించిన పవన్‌.. తెలుగు వారు గర్విస్తున్నారు

0
657
pawan kalyan reaction on bahubali 2 movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

pawan kalyan reaction on bahubali 2 movie
దేశ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందుతున్న ‘బాహుబలి 2’ సినిమాపై సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ మాత్రం స్పందించక పోవడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు పెరిగాయి. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి 2’ సినిమా పవన్‌ కళ్యాణ్‌కు నచ్చలేదా, లేక సమయం లేక పవన్‌ ‘బాహుబలి 2’ సినిమాపై స్పందించడం లేదా అంటూ టాక్‌ వినిపించింది. ఈ నేపథ్యంలోనే పవన్‌ కళ్యాణ్‌ బాహుబలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా వెయ్యి కోట్లు సాధించిన నేపథ్యంలో పవన్‌ స్పందిస్తూ రాజమౌళిపై అభినందనలు గుప్పించాడు. కృషి, పట్టుదలతో రాజమౌళి అండ్‌ టీం ఒక అద్బుతమైన చిత్రాన్ని తెరకెక్కించి ఇంత పెద్ద విజయాన్ని తెలుగు వారికి అందించి గర్వించేలా చేశారు అంటూ పవన్‌ పేర్కొన్నాడు. ఇలాంటి విజయాలు రాజమౌళికి మరిన్ని దక్కాలని ఆశిస్తున్నట్లుగా పవన్‌ చెప్పుకొచ్చాడు. కేవలం 10 రోజుల్లో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి 2’ ఇండియన్‌ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. తెలుగు వారు అంతా గర్వించేలా చేసిన ‘బాహుబలి 2’ సినిమా ఇంకా భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

Leave a Reply