మూడు దశల ఉద్యమం ..కేంద్రంపై పవన్ పోరాటం.

  pawan kalyan said 3 ways  war central govt special status purpose

తిరుపతి సభ వేదికగా ఆంధ్రాకి ప్రత్యేకహోదా పోరాటానికి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సన్నద్ధమయ్యారు.మూడు దశలుగా ఈ ఉద్యమాన్ని నిర్మిస్తామని అయన చెప్పారు.తొలిదశలో అన్ని జిల్లాలు తిరిగి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని పవన్ చెప్పారు.తొలుత కాకినాడలో సెప్టెంబర్ 9 న సభ నిర్వహిస్తామన్నారు.ఒకప్పుడు అదే కాకినాడ నుంచి బీజేపీ రెండురాష్ట్రాల తీర్మానం చేసిందని అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు.

రెండో దశలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు,ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెస్తామన్నారు.వారు పార్లమెంట్ లో సరిగ్గా పోరాడలేక ..హోదా సాధించకపోతే మూడో దశ ఉద్యమానికి తెర లేపుతామని పవన్ వివరించారు.మూడో దశలో రోడ్ల మీదకు వస్తామని అయన అన్నారు.అందరి అభిప్రాయాలు తీసుకొని ఉద్యమాన్ని తార స్థాయికి తీసుకెళ్లి హోదా సాధిస్తామని అయన ధీమా వ్యక్తం చేశారు.సీమాంధ్రుల్ని తక్కువ అంచనా వేసి పరిస్థితులు అక్కడిదాకా తెచ్చుకోవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు.

SHARE