Posted [relativedate]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరో సవాల్ ఎదురైంది.అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేయ తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్.దానివల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం పెరుగుతుందన్న ఆందోళనతో కొందరు దాదాపు ముప్పై గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారి ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వస్తే తమ జీవితాలు కాలుష్యం కోరల్లోనలిగిపోతాయని …మీరే కలుగజేసుకొని కాపాడాలని విన్నవించుకున్నారు.
ఈ సమస్యపై పవన్ స్పందన ఇది …’జనసేన పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేస్తుంది.అభివృద్ధి అంటే జనం పురోగతివైపు నడవడమే కానీ భయంతో బతకడం కాదు.ఈ సమస్య పరిష్కారంపై అధికారులతో మాట్లాడతా’…మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితుల తరపున పవన్ మాట్లాడిన మాటలు ఎంత ఆదర్శంగా వున్నాయి..రాయబార,దౌత్య కార్యాలయాల్లో వాడేంత సున్నితంగా వుంది భాష.అయన ఇంతకుముందు కూడా చెప్పారు …భాధ్యరాహిత్యంగా మాట్లాడబోనని. కానీ ఆ మాటలతో సమస్యకి నిజమైన పరిష్కారం దొరుకుతుందా?
ఆదర్శం వేరు .వాస్తవం వేరు.ఇప్పుడు పవన్ చెప్పిన పరిష్కారం ఆదర్శవంతం..కానీ పారిశ్రామికాభివృద్ధికి సిద్ధపడితేనే అభివృద్ధి,ఉద్యోగం,ఉపాధి లభిస్తాయి.అదే సమయంలో పర్యావరణాన్ని ఏదో ఓ స్థాయిలో దెబ్బ తీస్తాయి.కాలుష్యాన్ని పెంచుతాయి.ఇవన్నీ వాస్తవాలు.ప్రాధాన్యం అభివృద్ధికి అయితే జనాన్ని నష్టపోతున్న వారికి మెరుగైన పరిష్కారం చూపించాలి.లేదా స్థానిక ప్రజల మాటకి విలువిస్తే పారీశ్రామికీకరణని కచ్చితంగా ఆపాలి.ఈ రెంటికీ మధ్యస్థమైన మాటలు ఉండొచ్చు కానీ..మధ్యస్థ పరిష్కారాలు అంత సులువు కాదు.అందుకే పవన్ ఆదర్శవంతమైన మాటలు పక్కనపెట్టి నిజం మాట్లాడి ఏదో ఓ వైపు నిలిస్తే మేలు.రాజకీయ దిగ్గజాలకు వల్లకాని సమస్యలు పవన్ ముందు పెట్టి ఇలా తప్పుబడితే ఎలా అని అనుకోవచ్చు.జనం అలాంటి నాయకుల్ని చూసారు కాబట్టే భిన్నమైన నాయకుడిని,రాజకీయాన్ని,నిజాన్ని కోరుకుంటున్నారు. ఆ స్థాయిలోనిలబడగలరో లేదో తేల్చుకోవాల్సింది పవన్ మాత్రమే ..