భీమవరాన్ని నందిగ్రామ్ చేయొద్దు… పవన్

Posted October 15, 2016

 pawan kalyan said dont do bheemavaram change nandigram

ఉభయ గోదావరి జిల్లాలు మనకు అన్నం పెట్టే జిల్లాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇటువంటి జిల్లాల్లో నదులను కలుషితం చేసే ఫ్యాక్టరీలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లుగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు.

 భీమవరంలో స్థాపించనున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్స్‌ సమస్య మరొక నందిగ్రామ్‌గా మారేలా తయారైందని జనసేన నేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అక్కడ ఎన్విరాన్‌మెంటల్‌ నార్మ్స్‌ను పాటించలేదని ఆయన అన్నారు. పరిశ్రమ పెట్టడానికి పంటలు పండని భూమి అనే నార్మ్స్‌ను కూడా పాటించలేదని ఆయన అన్నారు.

నదులను కలుషితం చేసే పరిశ్రమల స్థాపన సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్వా ఫుడ్ కోర్టు వద్దని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి తనను కలిసిన రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలకు అనువుగాని భూములలో స్థాపించాల్సిన పరిశ్రమలను అన్నంపెట్టే గోదావరి జిల్లాలలో స్థాపించడం ఎంత వరకూ సమంజసమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

SHARE