స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన?

Posted October 15, 2016

   pawan kalyan said  janasena party ready to election
జన సేన ఎన్నికల పరీక్షకు సిద్ధమవుతోంది.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ శ్రేణులనుంచి ఒత్తిడి వస్తున్న మాట నిజమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు.దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇక జనసేన కార్యాలయాన్ని కూడా తొందర్లోనే ప్రారంభిస్తామని పవన్ వివరించారు.భీమవరం సమీపంలో తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో అవసరమైతే సీఎం చంద్రబాబుని కలుస్తానని చెప్పారు .పారిశ్రామికీకరణకు తాను వ్యతిరేకం కాదని ..రైతులకి న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని పవన్ స్పష్టం చేశారు.

SHARE