ఆ ఇద్దరికీ పవన్ డెడ్ లైన్..

54
Spread the love

Posted [relativedate]

pawan kalyan says chandrababu and kamineni srinivas rao about uddanam kidney patients
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యపై గట్టిగా స్పందించారు.ఇచ్చాపురంలో వారితో సమావేశమైన పవన్ …బాధితుల గోడు విని కదిలిపోయారు. ఈ సమస్యపై 48 గంటల్లోగా స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కి డెడ్ లైన్ పెట్టారు.

ప్రజా సమస్యల్ని రాజకీయ లబ్ది కి వాడుకునే ఉద్దేశంతో కాకుండా చిత్తశుద్ధితో ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆడుకోడానికి ప్రయత్నిస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం జనసేన తరపున కొందరు వైద్యులతో కమిటీ వేస్తామని వారిచ్చే సూచనల తో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పవన్ చెప్పారు.దాని ఆధారంగా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కృషి చేయాలని …ఆ నివేదిక అందిన 48 గంటల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తానే ముందుండి ఉద్దానం బాధితుల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు.నిధుల లేవు అన్న సాకుతో ఇన్నేళ్ళుగా ఇంత తీవ్ర సమస్యని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేయడం తగదని పవన్ చెప్పారు.పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు డబ్బులతో కళకళలాడుతున్నాయని ….కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా ఉద్దానం సమస్య పరిష్కారానికి 100 కోట్లు కేటాయించాలని పవన్ కోరారు. ఆ నిధులతో అసలు సమస్యకు కారణాలపై రీసెర్చ్ చేసి …పరిష్కారానికి నడుం కట్టాలని అయన డిమాండ్ చేశారు. కేవలం డయాలసిస్ తో సమస్య పరిష్కారం కాదన్న విషయాన్ని పవన్ ప్రభుత్వానికి పదేపదే గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here