పేరెత్తకుండానే జగన్ కి పవన్ ఎర్త్ ..

  pawan kalyan scold  jagan kakinada meeting
కమలాన్ని టార్గెట్ చేసిన పవన్ నిజంగా ఎర్త్ పెట్టింది మాత్రం వేరొకరికి.ఆయనే వైసీపీ అధినేత జగన్.ప్రత్యేక హోదా అస్త్రాన్ని అనువుగా మార్చుకుందామని రెట్టించిన ఉత్సాహంతో జగన్ రంగంలోకి దిగారు.అసెంబ్లీ వేదికగా చెలరేగిపోయారు.వైసీపీ సభ్యులు వరసగా రెండురోజులు అసెంబ్లీ ని రణరంగంగా మార్చారు.అయితే పవన్ కాకినాడ సభతో ఇటు రావాల్సిన మైలేజ్ అటు పోయింది.సరే పోనీలే శత్రువుకి శత్రువు మిత్రుడనుకుందామంటే ….కమలం మీద యుద్ధం చేసిన పవన్ దేశాన్ని మాత్రం ఉపేక్షించారు.ఈ వ్యవహారం జగన్ కి మింగుడు పడడం లేదు.

మరోవైపు అంతకుమించిన రాజకీయ ఇబ్బంది ఇంకోటుంది.ముద్రగడ ఉద్యమంతో కాపులకి దగ్గరవుదామని జగన్ అండ్ కో విశ్వప్రయత్నం చేస్తున్నారు.ఇప్పుడు పవన్ ని విమర్శిస్తే ఆ వ్యూహం దెబ్బ తింటుందన్న భయం వైసీపీకి వుంది.కనీసం పవన్ తమని విమర్శిస్తే కౌంటర్ పేరుతో ఎదురుదాడి చేద్దామంటే ఆయన వైసీపీ ని గుర్తించనట్టే మాట్లాడుతున్నారు.పరోక్షంగా బంద్ గురించి ఔనా కాదా అన్నట్టు ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు.ఇదంతా చూస్తుంటే పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ గుర్తొస్తోంది.కోపమొస్తే తిట్టు ..లేకుంటే ….కనీసంమేమున్నామని గుర్తించమని పవన్ అత్తని అడిగినట్టు ఇప్పుడు జగన్ అదే డైలాగ్ కాస్త అటుఇటుగా జనసేనని అడగాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది.హోదా ఉద్యమం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ దాన్ని పవన్ తన్నుకుపోతుంటే ఏమి చేయాలో తెలీక అల్లాడిపోతున్నారు.వైసీపీ అధినేత జగన్ ఓ విషయం జ్ఞాపకముంచుకోవాలి.రాజకీయాల్లో ప్లాన్స్ మాత్రమే కాదు .కౌంటర్ ప్లాన్స్ కూడా ఉంటాయి.

SHARE