టీవీ లో పవన్ కొడుకు..

   pawan kalyan son akira nandan in ishq wala movieపవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్‌ అంతా ఆసక్తితో ఉన్నారు. అకీరా ఓ మరాఠీ చిత్రంలో చేసినా అది మనదగ్గరకు ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే, అకీరా నందన్ నటించినసదరు సినిమా త్వరలోనే టీవీలో రాబోతోంది. 2014వ సంవత్సరంలో రేణు దేశాయ్ ఒక కథను రాసి తానే దర్శక నిర్మాతగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అకీరా  ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను ఈటీవీ వారు తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఈ సినిమాను ఈ ఛానల్ లో ప్రసారం చేయనున్నారు. అలా అకీరా నందన్ బుల్లితెరపై కనిపించి, పవన్ అభిమానుల ముచ్చట తీర్చనున్నాడు.

SHARE