పవన్ పద్ధతిలోనే …అగ్రి గోల్డ్ లో నో స్పెషల్

Posted March 30, 2017

pawan kalyan speech at agrigold victims at vijayawada
అగ్రి గోల్డ్ వ్యవహారంలో టీడీపీ,జనసేన మధ్య టపాసులు పేలుతాయి అనుకుంటే అంతా సవ్యంగానే సాగిపోయింది.ఎప్పటిలానే జనసేన అధినేత పవన్ ఈ అంశంలోనూ సంయమనం తోనే మాట్లాడారు.అటు వైసీపీ ఇదే వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని బాంబులు పీలుస్తుంటే ..ఆ పేర్ల జోలికి పవన్ వెళ్ళలేదు.అగ్రి గోల్డ్ వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు,వాటి పరిష్కారాల మీదే పవన్ దృష్టి పెట్టారు.విజయవాడ పర్యటనలో పవన్ గళమెత్తిన అంశాలు ఇవే ..

సహారా, సత్యం, శారదా స్కాముల్లో బాధితులకు ప్రభుత్వాలు కొంత ఊరటనిచ్చాయని పవన్‌ కల్యాన్‌ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన మాట్లాడుతూ సహారా, సత్యం, శారదా స్కాముల్లో బాధితులకు జరిగిన న్యాయం కూడా అగ్రిగోల్డ్‌ బాధితులకు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ హాయ్‌లాండ్‌ను అమ్మినా రూ.100 కోట్లు వస్తుందని, వచ్చిన మొత్తంతో కొంత మేరకు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. సంస్థకు చెందిన ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందాలని, ప్రభుత్వ నాయకులెవరైనా ఆస్తులు కొట్టేయాలనుకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులు మోసపోయిన స్కామ్‌లో ఏజెంట్ల తప్పేమీ లేదని, ఏజెంట్లపై దాడి జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్‌ సంస్థలకు రాజకీయ నేతలే వత్తాసు పలికారని, భవిష్యత్‌ మీద కోటి ఆశలతో పేదలు పెట్టిన పెట్టుబడులను కాజేసి చాలామంది పెద్దలు వ్యక్తి లాభం పొందాలని కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బాధితులకు చాలావరకూ న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందని, రూ.1180 కోట్లు ప్రజాధనం నుంచి ఇవ్వాల్సి ఉందన్నారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికైనా వెనుకాడమన్నారు.

పవన్ కళ్యాణ్ కామెంట్స్:

అప్పుల బాధలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు

చట్టం ఒక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని అగ్రిగోల్డ్ విషయంలో రుజువైంది

విజయవాడ ఆర్టీఏ కార్యాలయం వద్ద టీడీపీ నేతల వ్యవహారాన్ని పరోక్షం గా ప్రస్తావించిన పవన్

ప్రభుత్వ అధికారి పై దాడి చేస్తే వారి బలం తగ్గిపోతుంది

ఎమ్మెల్యేలు, ఎంపీ లు అధికారులపై దాడులు చేస్తే వారు బలహీన పడతారు

అధికారుల బలహీనతకు అగ్రిగోల్డ్ ఒక నిదర్శనం

చట్టాలు అమలు చేయాల్సిన నేతలు అధికారుల పై దాడులు చేసి వాటిని బలహీన పరుస్తున్నారు

అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి

శవాల పై చిల్లర ఎరుకునే విధంగా కొందరు పెద్దలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి

అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ రేటుకు చేజిక్కించుకోవాలని కొందరు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి

అగ్రి వ్యవహారంలో ప్రత్యేకమైన taskforce ను ఎందుకు ఏర్పాటు చేయడంలేదు

ఎంతోకొంత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయాలి, బాధితుల్ని ఆదుకోవాలి

Hailand ని అమ్మి అయినా బాధితులకు పరిహారం చెల్లించాలి

కంపెనీ ఆస్తులు ప్రభుత్వానికి చెందాలి, ప్రభుత్వంలోని పెద్దలకు కాదు

నేను ఈ విషయంలో వామపక్షాలతో కలిసి పోరాడేందుకు సిద్ధం

ఆర్ధిక నిపుణులతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి

ప్రధాని దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు కి సూచిస్తున్నా

ప్రభుత్వం స్పందిoచకపోతే అగ్రిగోల్డ్ బాధితుల నాయకులతో కలసి భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తాం

ఈ విషయం పై స్థానిక నాయకులతో చర్చించే బాధ్యతను జనసేన నాయకుడు పోతిన మహేష్ కి అప్పగిస్తున్నా..

SHARE