కేక పెట్టించిన  పవన్ ప్రసంగం

Posted February 11, 2017

Pawan Kalyan speech at Harvard Universityపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హర్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొనేందుకు యూఎస్ లో  పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా హ్యామ్ప్ షైర్ లోని నషువా నగరంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. అమెరికాలో ఆయన ఇచ్చిన మొదటి ప్రసంగం కేక పెట్టించింది. అసలు జనసేన పార్టీ స్థాపన ఉద్దేశం ఏంటి..? ప్రస్తుత  భారతీయ రాజకీయ వ్యవస్థ ఎలా ఉందన్న విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.  

రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదని, అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని స్పష్టంచేశారు. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. సినిమాల్లో నటిస్తుంటే తనకు సంతృప్తి ఉండదని, ప్రజా సమస్యలపై పోరాడినప్పుడే రిలీఫ్ గా అనిపిస్తుందని చెప్పారు. అయితే సినిమాల ద్వారా వచ్చిన డబ్బును, ఇమేజ్‌ ను ప్రజా సేవకు ఉపయోగించుకుంటాన్నారు.

ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ… అధికారం జనసేన పార్టీ లక్ష్యం కాదని, ప్రజాశ్రేయస్సే జనసేన అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. తన సొంత డబ్బుతోనే జనసేన పార్టీ నడుపుతున్నానని పవన్ ఈ సందర్భంగా వివరించారు.

అలాగే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకూడదని సూచించారు. యువ రాజకీయ నేతలు అంటే రాజకీయ వారసులు కాదని, సామాన్య ప్రజల్లో నుంచి కొత్తవారు రావాలని పిలుపునిచ్చారు. కుల రాజకీయాలను కూడా తరిమికొట్టాలన్నారు.  

ఈ సందర్భంగా పవన్ కి ఓ అభిమాని ఎర్రకండువాని ప్రజెంట్ చేశారు. ఆ కండువాని అక్కడే వేసుకున్న పవన్ ఆ కండువా స్టైల్ కోసం కాదని అది భారతీయ శ్రామికుడి గుర్తు అని వివరించారు.

ఈ విధంగా దాదాపు 50 నిమిషాలపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన పవన్ చివరిగా భారత్ మాతా కీ జై…జైహింద్’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. దటీజ్.. పవన్ కళ్యాణ్

SHARE