పవన్ ఏమి మాట్లాడాలి ?

  pawan kalyan speech kakinada
ఆత్మగౌరవ సభకి కాకినాడ సిద్ధమైంది.అయితే ఆ సభలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఏమి చెప్పబోతున్నారు? ఏమి కోరబోతున్నారు ? ఎవరిని టార్గెట్ చేస్తారు? వీటి గురించే సర్వత్రా చర్చ సాగుతోంది.తిరుపతి సభనాటికి హోదా విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.ఈ కొద్ది రోజుల్లో పరిణామాలన్నీ వేగంగా మారిపోయాయి.హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది.ఇక ప్యాకేజ్ అంటూ హడావిడి చేసి చట్టబద్ధత లేని ఓ ప్రకటనతో సరిపెట్టింది.

ఇప్పుడు పవన్ పరిస్థితులకి తగ్గట్టు వ్యూహం మార్చుకుంటారా ? లేక హోదాకే డిమాండ్ చేసి దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడతారా ? ప్యాకేజ్ పై పవన్ స్పందన ఏమిటి ? ఈ మూడు విషయాల్లో ముందస్తుగా కసరత్తు పూర్తి చేస్తే ,ఓ కచ్చితమైన నిర్ణయానికి వస్తే …పవన్ ప్రసంగం కూడా సూటిగా ఉంటుంది.అలా కాకుండా భావోద్వేగాల మీదే ఆధారపడితే మాత్రం కష్టమవుతుంది.తాత్కాలికంగా విజయం సాధించినా ఆ భావోద్వేగాల్ని మరో రెండున్నరేళ్ల పాటు కొనసాగించడం అంత తేలిగ్గాదు.ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే? రాకపోతే ? ఈ రెండు సందర్భాల్లో కేంద్రం నుంచి అందే ఆర్ధిక సాయం లో తేడా గురించి ప్రజలకి అర్ధమయ్యేలా చెపితే బాగుంటుంది.

ప్యాకేజ్ ని హోదాతో పోల్చి చూపి లాభనష్టాల్ని బేరీజు వేయగలిగితే ఉద్యమాన్ని ప్రత్యేకంగా రగిలించాల్సిన అవసరం ఉండదు.ప్రజలు తామే అన్యాయం చేసిన వాళ్ళని ప్రశ్నిస్తారు.ఆలా వారిలో హోదా,ప్యాకేజ్ గురించి అవగాహన పెంచడానికి పవన్ దృష్టి పెడితే కాకినాడ సభ లక్ష్యం నెరవేరుతుంది.పవన్ పోరాటానికి రాచమార్గం ఏర్పాటవుతుంది .

pawan-3pawan-1

SHARE