పవన్-సునీల్ స్నేహితులుగా సినిమా !

0
490

Posted [relativedate]

  pawan kalyan sunil friends trivikram movie

పవన్ కళ్యాణ్, సునీల్ స్నేహితులుగా సినిమా రానుందా.. ? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం ‘కాటమరాయుడు’తో బిజీగా  ఉన్నాడు పవన్. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న
చిత్రంలో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న విషయం తెలిసిందే.

కుదిరితే నవంబర్ లోనే ఓ షెడ్యూల్ పూర్తి చేద్దామని పవన్ హింట్ ఇవ్వడంతో త్రివిక్రమ్ సినిమా పనులని వేగవంతం చేసినట్టు సమాచారమ్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులని పూర్తి చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై ఫోకస్ చేశాడట. ఇందులో భాగంగా పవన్ కి స్నేహితుడిగా ఉండే ఒక పాత్ర కోసం సునీల్ తీసుకొన్నట్టు సమాచారమ్. త్రివిక్రమ్ సునీల్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ సునీల్ ని అడగానే ఒకే అనేశాడట.

ఇప్పటి వరకు పవన్ సినిమాలో ఆయన స్నేహితుడిగా అలీ ఉండేవాడు. ఇప్పుడా అవకాశం సునీల్ కి దక్కనుంది.

Leave a Reply