పవన్ ‘కాటమరాయుడు’ని లైట్ తీసుకొన్నాడా.. ?

Posted October 14, 2016

 pawan kalyan take light katamarayudu movie shooting,pawan kalyan  katamarayudu movie shooting,pawan kalyan take light katamarayudu movie, pawan am ratnam movie shooting

ఎప్పుడూ లేనిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాని ప్రారంభించేశాడు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్ లో
బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే సెట్స్ పైకి వెళ్లిన ‘కాటమరాయుడు’లో పవన్ కి సంబంధించిన 5శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే ప‌వ‌న్ కొత్త
సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా లాంఛ‌నంగా మొద‌లైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.ర‌త్నం స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఐశ్వ‌ర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘సర్థార్-గబ్బర్ సింగ్’ నష్టాలని పూడ్చడానికే ‘కాటమరాయుడు’ని లైన్లో తీసుకొచ్చాడు.అయితే, ఈ చిత్రంపై పవన్ కి గురిలేదట.ఈ నేపథ్యంలోనే కాటమరాయుడు  సెట్స్ పై ఉండగానే ఎప్పుడూ లేనిది మరోసినిమాని ప్రారంభించేశారని చెబుతున్నారు. అంతేకాదు.. ‘కాటమరాయుడు’ షూటింగ్ సాఫిగా సాగే అవకాశాలు కూడా లేవనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే పొలిటికల్ సభలతో ఏపీ రాజకీయాలని హీటెక్కించాడు పవన్. అయితే, ఇప్పుడు పవన్ దృష్టి భీమవరం సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా
ఫుడ్ పార్క్ పై పడిందట. ఈ పార్కు నిర్మాణం కారణంగా దాదాపు 30 గ్రామాలు నష్టపోయే అవకాశం ఉంది. మత్స్యాకారులు ఉపాది కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ
మధ్యే బాధిత గ్రామల ప్రజలు వచ్చి పవన్ కలిశారట. ఈ పార్క్ నిర్మాణం అడ్డుకునేందుకు ఉద్యమించాలని కోరారట. అందుకు పవన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ మాటిచ్చాడు అంటే.. తిరుగుండదు. సో.. త్వరలోనే మెగా ఫుడ్ పార్క్ పై పవన్ ఉద్యమం చేయనున్నాడు. ఇదే జరిగితే కాటమరాయుడు షూటింగ్ కి మళ్లీ బ్రేకులు పడనున్నాయి.

మొత్తానికి.. ఏ విధంగా చూసిన ‘కాటమరాయుడు’ షూటింగ్ కి కష్టాలు తప్పేలాలా లేవు.

SHARE