బాబు,పవన్ లకు అసలైన పరీక్ష అగ్రి గోల్డ్?

Posted March 30, 2017

pawan kalyan to meet Agrigold Victims
జనసేన 2019 ఎన్నికలకి రెడీ అని చెప్పాక ఆ పార్టీ కన్నా టీడీపీ నేతలే పవన్ ని జగన్ కి ప్రత్యామ్న్యాయంగా ప్రతిపక్ష నేత పాత్రలో కూర్చోబెట్టేందుకు ఎక్కువగా ఆరాట పడ్డారు.సీఎం చంద్రబాబు,ఆయన తనయుడు లోకేష్ సైతం కాస్త అటుఇటుగా అదే భాష మాట్లాడారు.అందుకే ఉద్దానం కిడ్నీ బాధితులు మొదలుకొని ఎక్కడ ఏ సమయ విషయంలో పవన్ కలగజేసుకున్నా ఏపీ సర్కార్ వీలైతే ఆ సమస్యని పరిష్కరించడం చేసింది.లేదంటే పవన్ కి మర్యాదపూర్వకంగా వున్న ఇబ్బంది తెలియజేసింది.దీంతో జగన్ చాలా ఇబ్బంది పడ్డారు.ఆయన ఏ సమస్య లేవనెత్తినా అధికార పక్షం కౌంటర్ ఎటాక్ చేసేది.కానీ ఇప్పుడు అగ్రి గోల్డ్ వ్యవహారం మీద మాట్లాడడానికి,బాధితుల్ని కలుసుకోడానికి జనసేన అధినేత విజయవాడ వచ్చారు.అయితే మిగిలిన సమస్యల్లా ఇక్కడ రాజకీయ ప్రస్తావన లేకుండా మాట్లాడ్డం కుదిరే పని కాదు.ఎందుకంటే అగ్రి గోల్డ్ బాధితులు టీడీపీ లోని పెద్దల మీద ఆరోపణలు చేస్తున్నారు.

అగ్రి గోల్డ్ బాధితుల్ని కలిసాక వారి గోడు విన్నాక టీడీపీ నేతల మీద పవన్ గొంతు విప్పాల్సి ఉంటుంది.ఇది తెలిసి కూడా ఆయన ముందడుగు వేయడంతోనే ఈ వ్యవహారంలో జనసేన వైఖరి ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది.అదే సమయంలో పవన్ దూకుడుగా మాట్లాడినా సాఫ్ట్ గా సమాధానం చెప్పడం టీడీపీ శ్రేణులకు కూడా కష్టమే.అందుకే బాబు,పవన్ లకి పరీక్ష లాంటి ఈ ఎపిసోడ్ మీద వైసీపీ,జగన్ స్పెషల్ గా దృష్టి పెట్టారు.ఈ వ్యవహారంలో ఏ ఒక్కరు దొరికినా వదలకూడదని జగన్ అండ్ కో రెడీ గా వుంది.

SHARE