Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు దాదాపు అన్నీ రీమేక్సే అంటే అతిశయోక్తి లేదు. సుస్వాగతం, గోకులంలో సీత, తమ్ముడు, ఖుషీ, గబ్బర్ సింగ్, గోపాలగోపాల వంటి సినిమాలతో పాటు ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న కాటమరాయడు సినిమా కూడా రీమేకే. మిగిలిన సినిమాలు విడుదల తర్వాత హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే కాటమరాయుడు మాత్రం రిలీజ్ కాక ముందే ట్రైలర్స్, సాంగ్స్ రూపంలోనే దుమ్ము దులిపేస్తోంది. దీంతో మరో రీమేక్ పై మనసుపడ్డాడట పవన్. అది కూడా తమిళ్ హీరో అజిత్ సినిమానే కావడం విశేషం. అజిత్ నటించిన వివేగం సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట పవన్.
త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నాడట. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించనుందని తెలుస్తోంది.