పవన్ ,త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది.

0
596
pawan kalyan trivikram movie shooting start

Posted [relativedate]

pawan kalyan trivikram movie shooting startఆభిమానులు ఆసక్తి గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లా సినిమా స్టార్ట్ అయింది.ఈ రోజు ఉదయం నుండి పవన్ కళ్యాణ్ తన రెగ్యులర్ సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాలలో జరుగుతున్నది. జల్సా ,ఆత్తారింటికి దారేది సినిమా వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ మొదలైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు

రాజకీయాలలో బిజీ గా వున్నా ఈ జనసేనాని 2019 ఎన్నికల లోపు ఎన్నిఎక్కువ వీలు అయితే అన్ని సినిమా లు చేయాలని అనుకుంటున్నాడు.అందుకే కాటమరాయుడు సినిమా రిలీజ్ అయిన పది రోజులకే త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టాడు .త్రివిక్రమ్ కూడా ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాడు.ఈ సినిమా రాజకీయ నేపధ్యం లో రాబోతుంది అని అందరు అనుకుంటున్నారు.

మొత్తం 90 కోట్ల బడ్జెట్ తో హరిణి హాసిని ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారధ్యం లో రాధాక్రిష్ణ (చిన్న బాబు ) వస్తుంది .ఇప్పటికే 5 కోట్ల విలువైన సెట్ ఒకటి వేసారు.హీరో నాని తో నేను లోకల్ తో హిట్ కొట్టిన కీర్తి సురేష్ ,మజ్ను తో సూపర్ హిట్ అయిన అను ఏమ్మాన్యుల్ హీరోయిన్లు గా పవన్ కళ్యాణ్ తో జత కట్టబోతున్నారు.వరుస షెడ్యూల్స్ తో సినిమాను కంప్లీట్ చేసి దసరాకు విడుదల చేయనున్నాడట త్రివిక్రమ్. దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది అని సినీ పరిశ్రమ లో టాక్ వినిపిస్తుంది .ఇప్పటికే జల్సా ,ఆత్తారింటికి దారేది లతో కలెక్షన్ల దుమ్ము దులిపిన పవన్,త్రివిక్రమ్… ఈ సినిమా తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Leave a Reply