Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయడు నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఇక పవన్ ఇటీవల ప్రకటించిన విధంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దేవుడే దిగివచ్చినా సినిమాకు రెడీ అయిపోయాడు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరిగిపోయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
2019 నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లనున్న పవన్ ఈ గ్యాప్ లో వీలైనన్ని సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఇందులో భాగంగానే కాటమరాయుడు తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చేనెల 7నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరపడానికి నిర్ణయించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వరుస షెడ్యూల్స్ తో సినిమాను కంప్లీట్ చేసి దసరాకు విడుదల చేయనున్నాడట త్రివిక్రమ్. కాటమరాయుడతో కలెక్షన్ల దుమ్ము దులిపిన పవన్.. దేవుడే దిగి వచ్చినా తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.