Posted [relativedate]
రీసెంట్ గా కాటమరాయుడుగా అభిమానుల ముందుకొచ్చిన పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ వచ్చే నెల నుండి సినిమాను సెట్స్ మీదుకు తీసుకెళ్లనుంది. కాగా దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించనున్నాడని, ఇందుకోసం ఓ సాఫ్ట్ వేర్ ఆఫీస్ ని రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా ఒక రివెంజ్ ఫార్మేట్ లో ఉంటుందని సమాచారం. సినిమాలో పవన్ తండ్రిది ఓ టిపికల్ క్యారెక్టర్ అట. ప్రతి దానికి రెండు రెండు ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడట. దీంతో అతనికి ఇద్దరు భార్యలు, రెండు వ్యాపారాలు, రెండు ఆఫీస్ లు ఉంటాయట. మొదటి భార్య పిల్లలు అసమర్ధులుగా ఉంటారట. కానీ రెండవ భార్య కొడుకు పవన్ కళ్యాణ్ అన్ని విషయాల్లోనూ టాప్ గా ఉంటాడట. అయితే సడెన్ గా పవన్ తండ్రిని కొందరు చంపేస్తారట. దీంతో మొదటి భార్య తన సవతి కొడుకు పవన్ ని పిలిచి తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోమని కోరుతుందట. పవన్ ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే సినిమా అని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. ఇందుకోసం భారీ బడ్జెట్ తో ఒకేలా ఉన్న రెండు ఆఫీసులు, ఇళ్లను నిర్మించే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడట. అలానే త్రివిక్రమ్ తన స్టైల్లో డైలాగ్స్, మసాలాతో సీన్లను రాయడానికి పెన్నుకు పదును పెడుతున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.