త్రివిక్రమ్ ముహూర్తం పెట్టేశాడు

0
640
pawan kalyan trivikram movie shooting start details

Posted [relativedate]

pawan kalyan trivikram movie shooting start detailsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయడు సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాకు  దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ  సినిమా షూటింగ్ ని  ఈ నెల 25 నుండి ప్రారంభించనున్నారట  దర్శకనిర్మాతలు.

ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ చేసి సినిమాను దసరాకి రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ ఈ సినిమాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్నాడు. ఇందుకోసం త్రివిక్రమ్.. రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ ను కూడా వేయిస్తున్నాడట. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఈ సెట్ ను డిజైన్ చేశాడట. కాగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి  కుష్బూ  ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనుందట. మరి ముచ్చటగా మూడోసారి  త్రివిక్రమ్, పవన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి.

Leave a Reply