పవన్-త్రివిక్రమ్.. ఈసారి కొత్త దారిలో

 Posted October 19, 2016

pawan kalyan trivikram political background movie

పవన్ – త్రివిక్రమ్ లు ముచ్చటగా మూడోసారి జతకట్టబోతున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడీ జోడి హ్యాట్రిక్ కు సిద్ధమౌతుంది. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే, ఈసారి పవన్-త్రివిక్రమ్ కొత్త దారిలో వెళ్లనున్నారంట. ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు రాలేదని చెబుతున్నాడు. ఈ సీక్రెట్ ని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ రిలీవ్ చేశాడు. పవన్-త్రివిక్రమ్ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఫిక్సయిన విషయం తెలిసిందే. పవన్ -త్రివిక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తన్నా.. ఇటివలే త్రివిక్రమ్ ఈ సినిమా కధ చెప్పారు. రెగ్యులర్ సినిమా కాదిది. చాలా డిఫరెంట్ థాట్ తో వచ్చారు. ఇప్పటివరకూ తెలుగులో వినిపించని సౌండ్ ఇందులో డిజైన్ చేస్తాం. కధ విన్న దగ్గర నుండి చాలా థ్రిల్లింగా వుంది” అని చెప్పుకొచ్చాడు అనిరుద్.

ఈ చిత్రం కోసం ‘దేవుడే దిగొచ్చినా’ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న చిత్రమని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. పవన్ పొలిటికల్ కెరీర్ త్రివిక్రమ్ స్కిప్ట్ తోడైనట్టే.

SHARE