Posted [relativedate]
రోజు కో ట్వీట్ తో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా గా మరో ట్వీట్ ఇచ్చి మీడియా కి ఎక్కారు..తాజా ట్వీట్ లో పెద్ద నోట్ల రద్దుపై అయన స్పందించారు ప్రధాని మోడీ తీసుకొన్న నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని ఈ నిర్ణయం కారణం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని ఈ రకమైన ఇబ్బందుల కారణం గా నే కర్నూలుకు చెందిన బాలరాజు తో సహా అనేక మంది మృతి చెందారని, వీరందరి మృతికి రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ కారకుడని ట్విట్టర్ లో ప్రస్తావించారు. నల్ల కుబేరులు మాత్రం ఇంట్లోనే కూర్చుని కోట్లకు కోట్లు ఇంట్లోకి తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల తర్వాత కూడా మలమూత్రాలు చేతులతో ఎత్తే మన దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా? అని ప్రశ్నించారు. నోట్ల ఉపసంహరణ దేశంలో పేద, బడుగు, రోజువారీ కూలీలు, గృహిణులు, చిరు వ్యాపారులపై ఎంత ప్రభావం పడిందో మీకు తెలుసా..? అని ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.
ఐతే వివిధ అంశాలపై గత నాలుగు రోజుల నుంచి పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఐతే పవన్ ట్వీట్లను గమనిస్తున్న భారతీయ జనతా పార్టీ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ కి సినీ గ్లామర్ మినహా రాజకీయ గ్లామర్ లేదని అంటోంది.. హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి పవన్ జాతీయ గీతం మీద చేసిన ట్వీట్ గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని కూడా సోషల్ మీడియా లో హల్ చల్ జరుగుతోంది..మొత్తం మీద ట్వీట్ లు చిలికి గాలివాన తెచ్చేలా ఉన్నాయి…