అభిమాని కుటుంబానికి పవన్ పరామర్శ..

 pawan kalyan went fan vinod kumar home
కర్ణాటక ,కోలార్ లో జరిగిన ఘటన లో మృతి చెందిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.ఈ ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన పవన్ నేరుగా వినోద్ ఇంటికెళ్లారు.ఆయన్ని చూడగానే వినోద్ తల్లిదండ్రుల శోకం కట్టలు తెంచుకుంది.పవన్ పట్ల తమ కొడుక్కి ఉన్న అభిమానాన్ని వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.అది చూసి పవన్ కదిలిపోయారు .ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.సేవా రంగంలో ఆమె కుమారుడి ఆశయాలు నెరవేర్చడానికి తన వంతు సాయం చేస్తామని చెప్పారు.

కోలార్ లో పవన్,Jr. ఎన్టీఆర్ అభిమానుల మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది.తరువాత జరిగిన దాడిలో వినోద్ చనిపోయారు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన వినోద్ మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సి వుంది.ఇంతలో ఇలా జరిగింది.వినోద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ జరిగినదానిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 pawan-vonod-family-(1)

SHARE