పవన్ కాకినాడలో ఏమిచేస్తున్నాడు…

  pawan kalyan what doing kakinada

జనసేన నేత మారిశెట్టి రాఘవయ్య, నిర్మాత శరత్‌తో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం భేటీ అయ్యారు. మరికాసేపట్లో కిరణ్ కంటి ఆసుపత్రిలో జరిగే ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పవన్ పాల్గొంటున్నారు . అనంతరం 4 గంటలకు కాకినాడలో జరుగనున్న బహిరంగ సభకు పవన్ హాజరుకానున్నారు. ఈ సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పవన్ సభకు దాదాపు లక్ష మంది అభిమానులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సభా ప్రాంగణంలో 75వేల మందికి మాత్రమే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.⁠⁠⁠⁠

pawan-3

SHARE