జనసేన సిద్ధాంతం..పవన్ పుస్తకం

   pawan kalyan wrote janasena party  nenu -manam -janam book
ప్రత్యేక హోదాపై పవన్ సమరభేరీ మోగిస్తున్నా జనసేన సిద్ధాంతం…రాజకీయ వ్యూహం పై ఇంకా స్పష్టత రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.వాటికి సమాధానమిచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.నేను -మనం -జనం (మార్పు కోసం యుద్ధం ) పేరుతో పవన్ ఓ పుస్తకం రాయబోతున్నారు.అందులో జనసేన ఆలోచనా విధానాన్ని,పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశాల్ని ,సాధించాలనుకున్న ఆశయాల్ని వివరిస్తారు.

పవన్ తన భావాలు పంచుకోడానికి పుస్తకాలు రాయడం ఇదే మొదలు కాదు.ఇంతకముందు కూడా ఇజం అనే పుస్తకం తీసుకొచ్చారు.అయితే అందులో వాడిన భాష,పద్ధతులు పెద్దగా జనానికి అర్ధం కాలేదు.రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆ పుస్తకంపై సెటైర్లు కూడా వేశారు.ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈసారి పుస్తకం బాగా సరళంగా,సూటిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.2017 ప్రథమార్ధంలో ఈ పుస్తకం బయటికి వచ్చే అవకాశముంది.

SHARE