పవన్ ప్రెస్మీట్ డిటైల్డ్ గా…

0
500
pawan pressmeet in detailed
Posted [relativedate] 
pawan pressmeet in detailedఎన్నికల ముందు నా రాజకీయ అనుభవం గురించి ఏ నాయకుడు అడగలేదు

బీజేపీకి మద్దతిస్తున్నప్పుడు నాకు రాజకీయ అనుభవం ఉందా? అని ఏ బీజేపీ నాయకుడు అడగలేదు – ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదు – ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు నన్ను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారు – బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారు – ఎన్నికలముందు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకు – రాజకీయాల్లో నాకు ఏబీసీడీలు తెలియవని.. నేర్చుకుని రమ్మంటున్నారు – ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుంది – కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది – మూడేళ్ల కాలంలో నేను ప్రభుత్వాలను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు – అన్నీ రూల్ బుక్ ప్రకారం జరగాలంటే కుదరదన్న సంగతి నాకు తెలుసు – అందుకే తగినంత సమయం ఇవ్వాలని భావించా

నోట్ ఫర్ ఓట్ విషయంపై..

నోట్ ఫర్ ఓట్ లో కూడా నేడు ఆనాడే మాట్లాడేవాడిని – కానీ ప్రజా సమస్యలు వెనకపడతాయని చూసి చూడనట్లు వ్యవహరించా.. తెలియక కాదు – పైగా తెలుగుదేశం పార్టీ మాత్రమే తొలిసారిగా అలా చేసుంటే బలంగా అడిగేవాడిని – కానీ అంతకు ముందు చాలా పార్టీలు అవే చేశాయి – అందుకే ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలనే అలా ఆ విషయంపై కావాలనే స్పందించలేదు – అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ చేస్తాయి – దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక్క మాట కూడా మాట్లాడలేదు- దాన్ని నేను వెనకేసుకు రావడమనుకోండి, ఇంకేమైనా అనుకోండి – వాళ్లు చేస్తున్నది తన ఉద్దేశంలో సరైనదేనని భావించాల్సిన అవసరం లేదు

టీడీపీ – బీజేపీకి మద్దతు తెలపడంపై..

గత మూడేళ్లూ దేశం సమస్యల్లో చిక్కుకుపోవడం మినహా మరేమీ లాభాలను పొందలేదు – అటు నరేంద్ర మోదీ, ఇటు చంద్రబాబులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు – పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గొడవలు, రోహిత్ వేముల ఘటన, నోట్ల రద్దు వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడించాయి – ప్రతి విషయంలోనూ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు – నేను బీజేపీని, ఆ పార్టీ నాయకులను ఎంత అర్థం చేసుకుందామని అనుకున్నా, మింగుడు పడట్లేదు – వారు అనుకున్నది చేస్తున్నారే తప్ప, ప్రజల మనోభావాలను గురించి పట్టించుకోవడం లేదు – పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదనే కొత్తపార్టీకి అవకాశం ఇద్దామని టీడీపీ- బీజేపీకి మద్దతు ఇచ్చా – ఎన్నికలకు ముందు ఆశలు కల్పించి ఇపుడు కుంటిసాకులు చెప్పడం తగదు – నేను ఎన్నికలకు ముందు మద్దతిచ్చినప్పుడు నా రాజకీయ అనుభవం గురించి ఎవరూ అడగలేదు – ప్రత్యేక హోదా హామీ గురించి మాట్లాడితే మాత్రం నాకు రాజకీయ అనుభవం లేదంటారు

వెంకయ్యనాయుడిపై….

ప్రత్యేక హాదా ఆనాడు పదేళ్లు కావాలన్నారు – పదవుల్లోకి వచ్చాక హామీలను వదిలేశారు – నేను హోదా సంజీవని కాదంటున్నారు – కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం నాకు నచ్చలేదు – అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి – సమస్యను అర్థం చేసుకుంటారనే టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చా – రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు – మీరు సన్మానాలు చేయించుకోవచ్చు. ఏదైనా చేయించుకోండి. కానీ నమ్మకాన్ని నిలుపుకోండి – భిన్న మతాలు, కులాలను గౌరవించకుండా ప్రభుత్వాలను నడపలేరు – ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ – బీజేపీ మాట మార్చాయి – బీజేపీ నాయకులు వైఖరి బాధ కలిగిస్తోంది – ప్రజల మనోభావాలను వారు లెక్కలోకి తీసుకోవడం లేదు – తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి – ప్రజలను చులకన చేసి వెంకయ్యనాయుడు మాట్లాడడం సరికాదు – స్వర్ణ భారత్ ట్రస్ట్ పై పెట్టిన మనసు ఏపీపై పెడితే ప్రత్యేక హోదా ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేది – స్టేటస్ ఐదు సంవత్సరాలు కాదు.. పది సంవత్సరాలు ప్రసాదిస్తామంటారు – ప్రసాదించడానికి మీరేమైనా దేవుళ్లా? దిగొచ్చరా? మీరు అందరిలాంటి మనుషులు కాదా? ప్రత్యేకించి దిగొచ్చారా? – ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పైనుంచి దిగొచ్చామనుకుంటున్నారా?- మేమందరం మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు? – మేమీ దేశ ప్రజలం – మీ ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒక రోజు ఒకమాట చెప్పి, మరోరోజు ఇంకో మాట చెబితే ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు

చంద్రబాబు నాయుడిపై..

“ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేను మద్దతివ్వడానికి కారణం ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్ – పరిపాలనా అనుభవం – 2014 ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడే చెప్పాను- వారి పరిపాలనా అనుభవం రాష్ట్రానికి కావాలని- ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్రయత్నించక పోడవం ఆయన నైతికంగా చేస్తున్న తప్పు – దాన్ని సరిదిద్దుకోవాలి – మాటిచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది – స్పెషల్ స్టేటస్ కాకుండా ప్యాకేజీతో ఏం వస్తుంది? – నోట్ల రద్దుకు చంద్రబాబు మద్దతు పలికారు – ఆపై ఇబ్బందులు ఉన్నాయని, నోట్ల రద్దుతో నష్టమేనని చెబుతూ ఐదు సార్లు మాటలు మార్చారు – ఇంత అనుభవమున్న మీరే ఇన్నిసార్లు మాటలు మారుస్తుంటే, ప్రత్యేక హోదాపైనా మీరు మాట మార్చారని ఎందుకు అనుకోకూడదో స్పష్టంగా చెప్పాలి – రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో చంద్రబాబునాయుడు ఎందుకు సర్దుకుపోవాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పాలి – “మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి – ఏ బేసిస్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? – మిమ్మల్ని ఎవరు కాంప్రమైజ్ కావాలని చెప్పారో చెప్పండి – నాకు కాదు… మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది – ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టారు – దయచేసి దీన్ని మీరు చెయ్యనప్పుడు రాజధానిని ఎలా నిర్మిస్తారు?” – ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టి, ప్రత్యేక ప్యాకేజీ చాలని పదేపదే చెబుతూ, ప్రజలను మభ్య పెట్టాలని ఎందుకు చూస్తున్నారు

జల్లికట్టు స్ఫూర్తిపై…

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం మహోగ్రరూపంలో సాగుతుందన్న విషయం నాకు ముందే తెలుసు – నాకు నెల రోజుల క్రితం తమిళనాడుకు షూటింగ్ కు వెళ్లినప్పుడు నన్ను కలిసిన పాత మిత్రులు కొందరు ఈ విషయాన్ని చెప్పారు – అక్కడ యువత మధ్య వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారాన్ని గురించి చూపించారు – జల్లికట్టు పెద్ద గొడవ అవుతుందని వారు ముందే చెప్పారు – ఎందుకు గొడవలు జరుగుతాయని నేను అడిగితే, “జయలలిత చనిపోయాక, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమిళనాడు రాజకీయాలను శాసించడం అక్కడి రాజకీయ నాయకులు, పార్టీలు ఒప్పుకోగలిగారేమో కానీ, అక్కడి యువత, ప్రజలకు ఇష్టం లేదు – ఎందుకంటే, వాళ్లు దాన్ని తమ ద్రావిడ సంస్కృతిపై బీజేపీ చేస్తున్న దాడిగా పరిగణించారు – అందుకని వాళ్లు ఈ రూపంలో ఉద్యమించారు – బీజేపీ నిర్వాకం మూలంగానే తమిళనాడు యువతలోని సంఘటిత శక్తి బయటకు వచ్చింది –
జల్లికట్టు ఉద్యమం అంటే ఎద్దులను లొంగదీసుకునే ప్రక్రియ లేదా తమిళనాడు సంస్కృతి కాదు – అక్కడి యువతకు బీజేపీపై ఉన్న కోపం – వాళ్ల నాయకులు బీజేపీని ఎదిరించలేక పోతుంటే, ఆ కోపం ఇలా బయటకు వచ్చింది – జల్లికట్టు ఉద్యమాన్ని నిజంగా అర్ధం చేసుకుంటే ఆ విషయం తెలుస్తుంది

బీజేపీపై…

సుజనా వంటి వ్యక్తులను పక్కనెందుకు పెట్టుకున్నారు – – వ్యక్తిగతంగా సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావులు నాకు తెలుసునని, వారిపై గౌరవం ఉంది – వ్యక్తిగతంగా శత్రుత్వం, విభేదాలు లేవు – సమస్యల విషయానికి వస్తే నేను ఎవరినైనా ఎదిరిస్తా – “ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల పక్షాన నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా విభేదించి వచ్చిన వాడిని – అలాంటిది మీతో ఉన్న పరిచయమో, స్నేహమో… కలిసి ప్రయాణించినా దాన్ని విభేదించి బయటకు రావడానికి నాకేమీ ఇబ్బంది లేదు – దాన్ని గురించి ఆలోచించను – మీకూ నాకూ మధ్య ఉన్నది ఓ కామన్ ఎజెండా – ప్రజల కోసం పనిచేయడం – అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒక్కసారి నాకు చెప్పాలి – నాక్కాదు… ప్రజలకు చెప్పాలి”

టీడీపీ ప్రభుత్వంపై…

ఏపీలో టీడీపీ ప్రభుత్వం లేదు ..మినీ బీజేపీలా ఉంది – ప్రత్యేక హోదాపై ఎందుకు రాజీ పడ్డారు – ఓటేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాలి – మీరు ప్రజల పక్షం ఉండనప్పుడు ..నేను మీ పక్షం ఎందుకుండాలి ? – ఇష్టం వచ్చినట్లు వెంకయ్యనాయుడు మాట్లాడితే ఊరుకునేది లేదు – హోదా సంజీవని కాదంటున్నారు – ఆనాడు 15 ఏళ్లు కావాలన్నా వెంకయ్యనాయుడు ఇపుడు మాట మార్చారు – మూడేళ్లలో ఇన్ని మాటలు మారిస్తే ప్రజలు నమ్మరు – ప్రజలు చేతులు కట్టుకుని కూర్చుంటారా..? – చంద్రబాబు పరిపాలనానుభవం ఏపీకి అవసరం

సుజనా చౌదరి, రాయపాటిలపై..

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిని సుజనా చౌదరి ఎగతాళి చేయడం సరికాదు – ఏ స్ఫూర్తితో సుజనా చౌదరి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు – రాయపాటి , సుజనా చౌదరి అవినీతి ఆరోపణలపై నిపుణుల విచారణ కమిటీ వేయండి – హోదా కోసం వీలైతే పోరాడండి, పోరాడే వారిని వెనక్కి నెట్టకండి – పోలవరంపై మేం అడిగినదానికి సమాధానం చెప్పలేదు – బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎందుకు వెనక్కివ్వలేదు – ఇప్పుడు అడుగుతున్నా? మీ వెనకాల ఇన్ని లోపాలు, సమస్యలు పెట్టుకుని ప్రజలను అనే హక్కు మీకు ఎక్కడుంది? – చేతనైతే మీరు ప్రజలకు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయండి – పోరాటం చేసే వారిని కించపరచకండి – పోలవరం విషయంలో అవినీతికి పాల్పడుతున్న రాయపాటి సాంబశివరావు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన సుజనా చౌదరిలను శిక్షించాలి – సింగపూర్ ప్రెసిడెంట్ లీ క్వాన్ యూ తనకు ఆదర్శమని చెప్పుకునే చంద్రబాబు, అదే మాటపై ఉండాలి – ఎలాగైతే అవినీతి ఆరోపణలు వచ్చిన తన సొంత స్నేహితులను, సహచరులను లీ క్వాన్ శిక్షలు అమలు జరిపారో అదే పద్ధతి అమలు చేయాలి – వారిపై ఎక్స్ పర్ట్ కమిటీని వేయాలి – అంబుడ్స్ మన్ ను నియమించాలి – అనుభవమున్న పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి

విశాఖ హోదా ఉద్యమంపై..

విశాఖలో నిరసనకు అనుమతి ఇచ్చి ఉండాల్సింది – కనీసం గంటైనా అనుమతి ఇచ్చి ఉండాల్సింది – ఉద్యమాన్ని వాయిదా వేయించారు.. కానీ ఉధృతిని ఆపలేరు – హోదా కోసం ఎందుకు నిరసన తెలపకూడదో సమాధానం చెప్పాలి – స్పెషల్ ప్యాకేజీ హోదాకు సమానమైంది కాదు – పోలీసులతో కాదు..పాలసీలతో పరిపాలన సాగించాలి – తెగించి పోరాడే పరిస్థితి తీసుకురాకండి – భయపెట్టి పాలిస్తామంటే కుదరదు.

బీజేపీ – టీడీపీ మిత్రపక్షంపై

సుజనా వంటి వ్యక్తులను పక్కనెందుకు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. వ్యక్తిగతంగా సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావులు తనకు తెలుసునని, వారిపై గౌరవం ఉందని, వ్యక్తిగతంగా శత్రుత్వం, విభేదాలు లేవని చెబుతూనే, సమస్యల విషయానికి వస్తే తాను ఎవరినైనా ఎదిరిస్తానని స్పష్టం చేశారు. “ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల పక్షాన నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది మీతో ఉన్న పరిచయమో, స్నేహమో… కలిసి ప్రయాణించినా దాన్ని విభేదించి బయటకు రావడానికి నాకేమీ ఇబ్బంది లేదు. దాన్ని గురించి ఆలోచించను. మీకూ నాకూ మధ్య ఉన్నది ఓ కామన్ ఎజెండా. ప్రజల కోసం పనిచేయడం. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒక్కసారి నాకు చెప్పాలి. నాక్కాదు… ప్రజలకు చెప్పాలి”

Leave a Reply