హోదా పోరు ఆగలేదన్న పవన్…

    pawan said continuous ap special status war

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జనసేన ఉద్యమం ఆగిపోలేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తనను కలవడానికి వచ్చిన రైతులతో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన జనసేన పార్టీ నిర్మాణం కనిపించకపోయినా అడ్మినిస్ట్రేషన్ వర్క్ చురుకుగా సాగుతున్నదని చెప్పారు. గోదావరి జలాలను కలుషితం చేసే అక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నానన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

SHARE