అమరావతి ఎప్పుడు పూర్తి అవుతుందో.. పవన్

    pawan said tirupati meeting how long  amaravathi completed work

* ఈ రాజధాని కట్టేసరికి…. చిన్న తరగతి చదివే విద్యార్థి…. పెద్ద చదువులు కూడా పూర్తి చేస్తాడు.

* ఎంపీలు ఏమిటీ… యాచకులు లాగా…. ప్రత్యేక హోదా కోసం సార్ సార్… అంటూ ప్రాధేయపడి… తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతీయకండి.

* మెడ తెగి పడాలే కానీ అడుగు వెనక్కి పడకూడదు…. అలా ఉండాలి… డిమాండ్.

* కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు…. గట్టిగా మాట్లాడి…. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత… ఆయన స్పెషల్ స్టేటస్… అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు… మంచిది కాదు. పార్టీ ప్రయోజనాల కన్నా…. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ఈ విషయంలో వెంకయ్యనాయుడు తీరు భాధ గా ఉంది.

* మరో అశోక్ గజపతి రాజు ఏమంటాడు…. ప్రత్యేక హోదా విషయంలో.. మూడు రాష్ట్రాల్లో… ఒప్పుకోవడం లేదంటాడు. పౌరుషం ఉంటే… రాజీనామా చేసి ఆయన వచ్చేయవచ్చు కదా. తుమ్మతే ఊడిపోయే ముక్కు లాంటి పదవిని పట్టుకొని ఊగులాడటం.

* చంద్రబాబునాయుడు ఎందుకు గట్టిగా అడగడం లేదు. ఏమి గట్టిగా అడిగితే… సీబీఐ ని ఎందుకు రంగంలోకి దింపుతుందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. ఏమి మీలో లొసుగులు ఏమైనా ఉన్నాయా…. లేకపోతే…. ఎందుకు గట్టిగా డిమాండ్ చేయడం లేదు.

* సెప్టెంబర్ 9 కాకినాడ లో సభ పెడుతాను.

* నా దగ్గర డబ్బులు లేవు అందుకే…. సినిమా ల్లో నటిస్తాను… రాజకీయాల్లో కూడా ఉంటాను.

SHARE