పవర్ స్టార్ మనసు గెలిచిన సప్తగిరి..!

0
601

Posted [relativedate]

pk1716కమెడియన్ గా ఉంటూ ఒక్కసారిగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా టర్న్ అవుతున్నాడు సప్తగిరి. అరుణ్ పవార్ డైరక్షన్లో సప్తగిరి చేస్తున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ఆడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. పవర్ స్టార్ వస్తున్నాడని తెలుస్తున్న ఆయన ఫ్యాన్స్ సప్తగిరి ఆడియోకి వచ్చారు. ఇక సప్తగిరి తానెంత మెగా ఫ్యానో తన మాటలతో వెళ్లడించగా ఆ తర్వాత మైక్ అందుకున్న పవన్ అదే రేంజ్ స్పీచ్ తో అదరగొట్టాడు.

సప్తగిరి సినిమాకు ముందు టైటిల్ కాటమరాయుడు అని పెట్టారట. అయితే అది పవన్ టైటిల్ గా పెట్టబోతున్నారని తెలిసిన వెంటనే స్వయంగా వీరే వెళ్లి ఆ టైటిల్ ఇచ్చారట. ఆ కృతజ్ఞతతోనే పవర్ స్టార్ సప్తగిరి ఆడియోకి వచ్చారు. అంతేకాదు అడగ్గానే టైటిల్ ఇచ్చిన సప్తగిరి అండ్ టీంకు తన ధన్యవాదాలు తెలియచేశాడు. ఇక తాను సినిమాలు చేస్తున్న చూసే తీరిక లేదని కాకపోతే సప్తగిరి ఎక్స్ ప్రెస్ కచ్చితంగా చూస్తానని అన్నారు పవర్ స్టార్. పవన్ రాకతో అదేదో స్టార్ సినిమా ఆడియో అన్న కళ వచ్చింది. ప్రత్యేకంగా సప్తగిరి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

Leave a Reply