పవన్ తవ్వేశాడుగా…

0
418
pawan speech in katamaryudu audio

Posted [relativedate]

pawan speech in katamaryudu audio
పవన్ కళ్యాణ్ …ఈ పేరు వినగానే యువతరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి.సినీలోకం జై కొడుతుంది.రాజకీయం మర్యాదగా వ్యవహరిస్తుంది.అయినా ఆయనలోనూ,ఆయన మాటల్లోనూ నేల విడిచి సాము చేసే తత్వం కనపడదు.తాత్వికత ధ్వనిస్తుంది.ఫిలాసఫీ అనగానే జీవితాన్ని అర్ధం చేసుకుని ప్రవర్తించడం,ప్రయాణించడం తెలియని చాలా మంది అదేదో అర్ధం కాని,అనుభవించే వయసున్నప్పుడు విలువ లేని విషయంగా భావిస్తారు.దారి తప్పి తిరిగి రాలేనంత కీకారణ్యంలో చిక్కుకున్నాక, దారి తెలిసినా ప్రయోజనముండదు ..వెనక్కి వచ్చే ఓపికుండదు.ఉడుకునెత్తుటి కుర్రకారుకి ఈ విషయం బుర్రకెక్కించగలిగితే వాళ్ళ జీవన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తన పాత సినిమాల ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారో పవన్ స్వయంగా వివరించారు.కాటమరాయుడు విశేషాలతో పాటు పాత సినిమాల్లో మంచిని తవ్వి మరీ చూపించాడు పవన్ కళ్యాణ్ .ఆ సభలో ఆయన ఏమి మాట్లాడారో ఓ సారి చూద్దామా..

ఈ మధ్యన ఇలాంటి సభల్లో మాట్లాడడం అలవాటు తప్పింది. అందుకే కొత్తగానూ, కాస్త బెరుగ్గాను ఉంద’ని పవన్ కల్యాణ్ అన్నారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ‘ఎంత ఫంక్షన్ చేసినా సరిపోదు. అందుకే పరిమితుల్లో ప్రీరిలీజ్ వేడుక జరగాలని చిన్నగా ఫంక్షన్ చేయాలని కోరాన’ని అన్నారు. తాను అభిమానులపై ప్రేమతోనే చిన్న ఆడిటోరియంలో వేడుక నిర్వహించాలని ఇలా చేశానని ఆయన చెప్పారు. ‘అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. టెక్నీషియన్ అవుదామని భావించాను, హీరోనైపోయిను. అయితే తోటపని అయినా, వీధులూడ్చే పని అయినా నిజాయతీతో చిత్తశుద్ధిగా చేస్తా’నని పవన్ కల్యాణ్ అన్నారు. ఇన్నేళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేశానని, భవిష్యత్ లో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని అన్నారు. తాను జీవితంలో నేర్చుకున్న చాలా అంశాలు సినిమాల్లో వచ్చాయని ఆయన చెప్పారు.

 త్రివిక్రమ్ తనకు ‘గోకులంలో సీత’ సినిమా నుంచి తెలుసని అన్నారు. “గోకులంలో సీత’ సినిమాలో ప్రేమ సర్వం, ప్రేమే అన్నింటికి మూలం అన్నది తెలుసుకున్నా. ఆ డైలాగ్ త్రివిక్రమ్ రాశారు. అలాగే ‘సుస్వాగతం’లో తండ్రి మరణిస్తే తిరిగే కుర్రాడిపాత్రలో చాలా ఏడ్చాను. నా జీవితంలో చాలా కదిలించిన సన్నివేశాలు సినిమాల్లో ఉన్నాయి’ అని పవన్ చెప్పారు. ‘తొలి ప్రేమ’ సమయంలో బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనిపించేదని అన్నారు. తనలో భావాలను సినిమా రూపంలో చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘తమ్ముడు’ సినిమాకి ప్రాణాలు ఫణంగా పెట్టేశానని ఆయన చెప్పారు. ఒక పిచ్చి ఉన్మాదంలో ఆ సినిమాలో చేశాను కానీ ఇప్పటికీ రాత్రిళ్లు చేతులు నొప్పిపెడుతుంటాయని పవన్ చెప్పారు. నువ్వు చేయ్యలేవని చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నించడమే తమ్ముడు సినిమా అని, అందుకే దానికి ట్రావెలింగ్ సోల్జర్ అని ట్యాగ్ లైన్ పెట్టానని ఆయన అన్నాడు.

‘బద్రి’లో నువ్వు నందా అయితే ఏంటి? అన్న ప్రశ్న తన జీవితమని అన్నారు. నీ ఎక్కువ ఏంటి? నువ్వు కూడా మనిషివే అని గుర్తు చేయడమని పవన్ తెలిపారు. ‘ఖుషీ’ సినిమాలో నా దేశాన్ని ప్రేమించడం తనకు చాలా ఇష్టమని చెప్పదానికే ఏ మేరా జహా పాటను పెట్టానని పవన్ చెప్పారు. ఖుషీ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కీడు శంకించిన తాను, గబ్బర్ సింగ్ సినిమా వరకు కోలుకోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు ఖుషీ టైంలో కోల్పోయిన శక్తి మళ్లీ వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ‘నాకెప్పుడూ చిరంజీవిగారే హీరే… నేను హీరోను కాదు’ అన్నారు పవన్.

‘ఓసారి 5 కిలోమీటర్లు దూరం వరకు ఊరేగింపు చేస్తామని చెబితే, నేనేమన్నా గంగిరెద్దునా సర్? అని అడిగానని, అందుకే తన స్నేహితులకు చెప్పి కారు రెడీగా ఉంచండి.. నేను వచ్చేస్తానని చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే రోడ్డుమీదకి వెళ్లేసరికి రోడ్లు కిక్కిరిసిపోయేలా జనాలు ఉన్నారని ఆయన చెప్పారు. అప్పుడు తన తండ్రి చెప్పిన ‘ఈ ప్రపంచంలో అందరూ సమానమే అన్న విషయం గుర్తించుకో’ అన్న విషయం ప్రతి క్షణం గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు.

Leave a Reply