Posted [relativedate]
జనసేనాని పవన్ కల్యాణ్ తన రాజకీయ గమనం సాఫీగా ఉండేలా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. సమస్యలపై సీరియస్ గా స్పందిస్తూ జనానికి భరోసా ఇస్తున్నారు. తాజాగా ఆయన చేనేతపై స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చేనేత కార్మికులు గుంటూరు చేసిన సత్యాగ్రహానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. కష్టాల్లో ఉన్న నేతన్నల కోసమే ఇక్కడికి వచ్చానంటూ వారికి భరోసా ఇచ్చారు. నేతన్నల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కూడా మాట్లాడలేని అన్ని అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలంటూ పిలుపునిచ్చారు.
చేనేత కార్మికుల సమస్యలపై ఆయన ప్రసంగించిన తీరుపై ఎంతో పరిపక్వత కనిపించింది. ఒక తీవ్రమైన సమస్యను అందరికీ అర్థమయ్యేలా ఎలా వివరించాలో… తనదైన స్టైల్ లో వివరించారు పవన్. చేనేత కార్మికుల కష్టాలను కళ్లకు కట్టారు. తాను సీజనల్ పొలిటిషయన్ కాదని… సీరియస్ గానే పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నాననే సిగ్నల్స్ ఇచ్చారు.
చేనేత సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరును ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఫాలో అయ్యారట. జగన్ కంటే పవనే ప్రతిపక్ష నేతగా కనిపిస్తున్నారని చంద్రబాబుతో అన్నారట. మొత్తానికి ఇతర పార్టీల నాయకులు కూడా పవన్ ప్రజెంటేషన్ ను మెచ్చుకుంటున్నారంటే… ఆయనకు పాలిటిక్స్ లో బంగారు భవిష్యత్తు ఖాయమంటున్నారు విశ్లేషకులు.