గుడ్ న్యూస్ : పవన్-త్రివిక్రమ్ సినిమా ముహూర్తం ఫిక్స్

Posted October 6, 2016

 pawan trivikram movie starting date fix

పవన్-త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘కాటమరాయుడు’తో బిజీగా ఉన్నాడు పవన్. డాలీ దర్శకత్వంలో
తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. దసరా తర్వాత చెన్నై షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే, ఈ చిత్రం తర్వాత
పవన్ – త్రివిక్రమ్ సినిమా మొదలు కానుందనే వార్తలొచ్చాయి.

ఈ యేడాది ఆఖర్లో (డిసెంబర్) నెలలో లేదా వచ్చే యేడాది జనవరిలో పవన్-త్రివిక్రమ్ సినిమా మొదలవ్వనుంది. పవన్ కోసం త్రివిక్రమ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో పవర్ ఫుల్ కథని రెడీ చేశాడు. టైటిల్ ‘దేవుడే దిగొచ్చినా’ అంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్-త్రివిక్రమ్ సినిమా మరింత త్వరగా.. అంటే నవంబర్ లోనే సెట్స్ పైకి వెళ్లనుందట.

తాజాగా, పవన్ తీసుకొన్న నిర్ణయంతో ఈ సినిమా ఇంకాస్త ముందుగానే ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్‌ లో త‌న 15 రోజుల డేట్స్‌ను కేటాయిస్తాన‌ని.. త‌న‌తో
షూటింగ్ ప్లాన్ చేసుకోమ‌ని పవన్ త్రివిక్ర‌మ్‌కి చెప్పాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే.. మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న పవన్-త్రివిక్రమ్ సినిమా మరింత త్వరగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE