పవన్, త్రివిక్రమ్ కొత్త చిత్రం…

0
771

  pawan trivikram new movie పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే రికార్డ్ ల మోతే, ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రెండు మంచి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసాయి, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వీళ్ళిద్దరి సినిమా అంటే అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలోను  ఎన్నో అంచనాలున్నాయి.

కృష్ణా నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా త్రివిక్రమ్ ఒక మంచి కథ  రెడీ చేసాడని, ఆ కథ పవన్ కి చాలా నచ్చిందని ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళే  ఆలోచనలో ఉన్నారని వినికిడి.

ప్రస్తుతం  పవన్ చేస్తున్న చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది, ఇంకో ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా రాజకీయాలోకి  వెళ్ళబోతున్నాడు  కాబట్టి ఈ చిత్రాన్ని నవంబర్ లోనే   మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

 

Leave a Reply