Posted [relativedate]
కత్తికి రెండు వైపులా పదునుంటుంది..ఇక రాజకీయ నాయకుడి నాలుక కి అన్ని వైపులా పదునుంటుంది.తాజాగా ప్రత్యేక హోదా పోరాటం కోసం ఎవరితో అయినా కలిసి పని చేయడానికి సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించగానే జగన్ తో ఆయన జట్టు కట్టడానికి సిద్ధమని ఊహాగానాలు ఊపందుకున్నాయి.కానీ పవన్ ప్రెస్ మీట్ ,ఆ రోజు ఆయన చెప్పిన విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆయన స్టేట్ మెంట్ ఒకరికి వ్యతిరేకంగా,ఇంకోరికి అనుకూలంగా ఇచ్చారనడంలో నిజం లేదని తేలుతుంది.అంతకు మించి ప్రత్యేక హోదా కోసం ఎవరితో అయినా కలిసి పని చేస్తామని చెప్పడం ద్వారా ఆయన ఇటు కుర్చీలో కూర్చున్న చంద్రబాబుకి …అటు అదెక్కాలనుకుంటున్న జగన్ కి ఏక కాలంలో వార్నింగ్ బెల్ మోగించారు.అదెలాగో చూద్దాం..
ఇప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న పెద్ద విమర్శ..చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నాడని..ప్రధాని మోడీని,సీఎం బాబుని టార్గెట్ చేయకుండా కేంద్ర మంత్రులు,ఎంపీ లని టార్గెట్ చేయడంతో పవన్ ఆ విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈసారి బాబుని,nda ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేయడంలో ఇక మొహమాటపడబోనని పవన్ తాజా స్టేట్ మెంట్ తో చెప్పినట్టు అయ్యింది.అనడమే కాదు ఇంతకుముందు లేనంతగా ఈసారి బాబుని పవన్ నిలదీసే ప్రయత్నం చేశారు.ఆ క్రమంలో వేరే పార్టీలతో అంటే ..వైసీపీ తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనన్న హెచ్చరికలు దేశం సర్కార్ కి పంపారు బాబు.దీన్ని వైసీపీ కి అనుకూలం అనుకునేవాళ్లు ఓ విషయం మర్చిపోతున్నారు.ఇన్నాళ్లు పవన్ ని బాబు పావుగా చూపడానికి వైసీపీ నేతలు ట్రై చేశారు.పవన్ ఎటూ తమతో కలవడన్న ధీమాతో …కలిసి పని చేద్దామని పిలిచేవాళ్ళు.ప్రజా కోర్ట్ లో ముఖ్యంగా హోదా అంశంలో ఆయన పోరాటాన్ని తక్కువ చేసి చూపేవాళ్లు.ఇప్పుడు పవన్ ప్ర్రకటనతో బంతి వైసీపీ కోర్టులో పడింది.ప్రజాకర్షణ కలిగిన సొంత పార్టీ నేతలనే భరించలేడన్న జగన్ ఇప్పుడు స్వయంగానో …పార్టీ నేతలతోనో పవన్ తో చర్చలకు సిద్ధం కావాలి.కానీ ఇప్పటిదాకా ఆ దిశగా వైసీపీ నుంచి చర్యలేమీ మొదలు కాలేదు.ఇప్పుడు వైసీపీ కి రెండు ఆప్షన్స్ వున్నాయి. ఒకటి పవన్ వద్దకు తనంత తాను వెళ్లి మాట్లాడాలి.లేదా ఆయన కలిసిరావడం లేదు ,బాబు మనిషి అనే విమర్శలని కట్టిపెట్టాలి.ఈ రెండూ చిన్న విషయాలేమీ కాదు.ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా ..ఈ ఆలోచన తోటే పవన్ ఒక్క స్టేట్ మెంట్ తో ఇద్దరికీ వార్నింగ్ బెల్ మోగించాడు.