11 న పవనిజం డే..బెజవాడలోఆత్మీయ భేటీ

Posted October 7, 2016

  pawanism day meeting doing october 11 vijayawada
సోషల్ మీడియాలో జనసేన అకౌంట్లు మొదలవ్వగానే పవన్ అభిమానుల గుండెల్లో గంటలు మోగాయి.కాకినాడ సభ తర్వాత పవన్ మౌనంతో సందిగ్ధంలో పడ్డ ఫాన్స్ కి తాజా పరిణామాలతో క్లారిటీ వచ్చేసింది.అందుకే విజయవాడలో ఉన్న అభిమానులు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ నెల 11 న పవనిజం డే గా జరిపి..జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.హోటల్ ఐలాపురంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల దాకా జరగనున్న ఈ భేటీ ముఖ్య ఉద్దేశాలు..

*పవన్ అభిమానులు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం
*గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి
*పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు,సలహాల స్వీకరణ
*దళిత,బీసీ నేతలకి సన్మానం నిర్వహించడం

బెజవాడ భేటీలో దళిత,బీసీ నేతలకి సన్మానం అనేది కచ్చితంగా రాజకీయ ఎత్తుగడే.భవిష్యత్ లో పార్టీ వైఖరికి అద్దం పట్టే విషయమే.అయితే ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలోను ఇలాంటి హడావిడి జరిగింది.పూలే,థెరెసా వంటి మహానుభావులకు ఎంతో గౌరవం దక్కేలా చర్యలు తీసుకున్నారు.రానురాను వాళ్ళ భావజాలం పక్కకిపోయి కేవలం ఛాయాచిత్రాలు మాత్రమే అక్కడ మిగిలాయి.ఇప్పుడు జనసేన దళిత,బీసీ నేతల్ని సన్మానించడం ఆహ్వానించదగ్గ పరిణామమే.కానీ ఈ చర్యలు మొక్కుబడి తంతులా మిగిలిపోకుండా పార్టీ భావజాలం,ఆలోచనలు,అమల్లో ప్రతిబింబించినపుడే వాటికి సార్ధకత.పవన్ అభిమానులూ వింటున్నారా?

SHARE