జగన్,పవన్ కొత్త ఇళ్లు చూసుకుంటున్నారు..

 Posted November 1, 2016

pawankalyan and jagan shifting to andhra
2019 ఎన్నికల పుణ్యమాని ఆంధ్రాలో రాజకీయ సందడి పెరగబోతోంది.ఇప్పటిదాకా హైదరాబాద్ కే పరిమితమైన వైసీపీ అధినేత జగన్,జనసేన అధినేత పవన్ ఆంధ్రాకి మకాం మార్చేస్తున్నారు.జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు తాడేపల్లి,మంగళగిరి ప్రాంతాల్లో సరైన స్థలం ఎంపిక చేసే పనిలో వున్నారు.అక్కడ జగన్ నివాస భవనం,పార్టీ కార్యాలయం ఉండేలా నిర్మాణం జరపాలని నిర్ణయం జరిగిపోయింది.హైదరాబాద్ నుంచి వచ్చి అతిధి రాజకీయం చేస్తున్నారని వస్తున్న విమర్శలకి తెరదించడం కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల లేదా వచ్చే నెల్లో శంఖుస్థాపన చేసి ఆరు నెలలోపే నిర్మాణం పూర్తి చేసేలా వైసీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మకాం మార్పు తాత్కాలికమా?శాశ్వతమా అనేది తెలియదు కానీ వచ్చే ఎన్నికల నాటికి అయన ఎక్కడ ఉండేది తేటతెల్లమైపోయింది.పవన్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడే ఓటు కూడా నమోదు చేయించుకోబోతున్నారు.అయన కోసం ఓ అద్దె భవనాన్ని చూసేందుకు జనసేన వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.అయితే ఇదేదో వ్యూహం ప్రకారం జరిగినట్టు కనిపించడం లేదు.ఏలూరు నుంచి పవన్ ని కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు,అభిమానులు అడగడంతో అయన వెంటనే అంగీకారం తెలిపారు.ఈ విషయాన్నే పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య అధికారికంగా వెల్లడించారు.

SHARE